Rachana television limited ntv files petition high court cinecolors programme ban the ministry of information and broadcasting

ntv news channel, ntv news channel ban, rachana television limited news, ntv high court petition, ntv petition high court, rachana television limited director ramadevi, ntv director ramadevi, The Ministry of Information and Broadcasting orders, high court of andhra pradesh

achana television limited ntv files petition in high court to cancel ban on cinecolors programme against The Ministry of Information and Broadcasting which orders to ntv channel.

NTV ప్రసారాలు నిలిపివేతపై పిటిషన్.. ‘అశ్లీలత’పై క్లారిటీ!

Posted: 01/28/2015 11:09 AM IST
Rachana television limited ntv files petition high court cinecolors programme ban the ministry of information and broadcasting

గతంలో NTV న్యూస్ ఛానెల్’లో రాత్రి 11.30 గంటలకు ప్రసారమయ్యే ‘సినీకలర్స్’ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించే పాటల్లో అసభ్యత, అశ్లలత వుంటోందంటూ కేంద్రానికి ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు మేరకు ఆ కార్యక్రమ డీవీడీలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ పరిశీలించింది. ఇలా పరీశీలించిన అనంతరం కేంద్రం దీనిపై స్పందిస్తూ.. వీక్షకులకు అనుగుణంగా ఈ కార్యక్రమం లేదని, అందులో అశ్లీలత, అసభ్యత చాలా ఎక్కువగా వుంటోందని తేల్చి చెప్పింది. ఈ విధంగా ప్రసారం చేయడం కేబుల్ టీవీ నిబంధనలకు విరుద్ధమని, అందువల్ల ఎన్టీవీ ప్రసారాలను ఓ వారం రోజుల (ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు)పాటు నిషేధిస్తున్నట్లు ఆ శాఖ డైరెక్టర్ నీతి సర్కార్ గతనెలలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

అయితే.. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రచన టెలివిజన్ లిమిటెడ్ (ఎన్టీవీ) యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రప్రభుత్వం గతనెల 19న జారీ చేసిన ఈ ఉత్తర్వులను రద్దు చేయాల్సిందిగా కోరుతూ ఆ సంస్థ డైరెక్టర్ టి.రమాదేవి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆమె కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శిని ప్రతివాదిగా పేర్కొన్నారు. 2012లో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ప్రసారమైన ఈ కార్యక్రమంపై రాతపూర్వకంగా ఇదివరకే వివరణ ఇచ్చామని డైరెక్టర్ పేర్కొన్నారు. ఆ ప్రొగ్రామ్’ని తాము 2012లోనే నిలిపివేశామని, దానికి సంబంధించి ఇప్పుడు నిషేధం విధించడం సరికాదని అన్నారు.

రెండున్నరేళ్ల క్రితమే నిలిపివేసిన కార్యక్రామానికి సంబంధించి ఇప్పుడు నిషేధం విధించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఎన్టీవీ సంస్థ డైరెక్టర్ టి.రమాదేవి తమ పిటిషన్’లో పేర్కొన్నారు. అసలు ప్రసారాలపై నిషేధం విధించే అధికారం కేంద్రసమాచార, ప్రసారమంత్రిత్వశాఖ డైరెక్టర్’కు లేదని తెలిపిన ఆమె.. ఆ నిషేధం ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాల్సిందిగా కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యహారంపై విచారణ జరిపిన అనంతరం కోర్టు తీర్పు వెలువడాల్సి వుంటుంద. మరి.. దీనిపై కోర్టు స్పందన ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles