Delhi police filed complaint rape case on acp for raping daughter in law

acp rape case, delhi acp rape case, acp daughter in law rape case, acp rape daughter in law, delhi acp rape daughter in law, delhi rape cases, police officers rape cases

delhi police filed complaint rape case on acp for raping daughter in law : the victims filed complaint on father in law acp for raping her.

ఏసీపీ దాష్టీకం.. కూతురులాంటి కోడలిపై అత్యాచారం!

Posted: 01/28/2015 10:40 AM IST
Delhi police filed complaint rape case on acp for raping daughter in law

సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలు, అత్యాచారాలను అరికట్టాల్సిన పోలీసు అధికారులే మహిళలపై ఆకృత్యాలకు పాల్పడుతున్నారు. అందరికీ అండగా నిలుస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలబడాల్సిన అధికారులే రావణాసురిడిని తలపించేవిధంగా దారుణాలకు ఒడిగడుతున్నారు. చిన్న స్థాయి నుంచి ఉన్నత పదవిలో వున్నవారుసైతం మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారంటే.. భారత‘లక్ష్మి’కి ఎవరు దిక్కు!

మహిళ ఓ కుటుంబాన్ని చక్కదిద్దుతుందని అంటారు. కానీ.. ఇక్కడ ఓ మహిళకు ఆ ఇంట్లోనే రక్షణ లేకుండా పోయింది. కోటిఆశలతో మెట్టినింటికి వచ్చిన ఓ ఆడబిడ్డపై కన్నకూతురితో సమానంగా చూసుకోవాల్సిన మామ విషం కక్కాడు. అదికూడా ఏసీపీ లాంటి ఉన్నత పదివిలో వుండి కూడా తన బాధ్యతలను విస్మరించి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు ఆ కీచకుడు! ఈ దారుణం దేశరాజధాని న్యూఢిల్లీలో చోటు చేసుకుంది.

న్యూఢిల్లీ ఉత్తరమండలం ప్రాంతంలో అసిస్టెంట్ కమిసనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి.. తన కోడిలిపైనే అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. అయితే.. సదరు ఉన్నతాధికారి పేరును వెల్లడించడానికి పోలీసులు నిరాకరించారు. ఎందుకంటే.. బాధితురాలి పేరు బహిర్గతం కాకుండా వుండేందుకు వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

గతేడాది మే నెలలో తన మామ బెదిరించి తనను అత్యాచారం చేశాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని అతగాడు బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అయితే.. నిందితుడు పోలీసు వ్యవస్థలో ఉన్నతాధికారిగా వుండటంతో అతడిని ఇంకా అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది.

పురుషుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచి వారిని జీవనగమ్యంవైపు నడిపించే మహిళలకు గమ్యమే లేకుండా పోయింది. బయటేవారు కాదు.. ఇంట్లో వున్న పెద్దవాళ్లూ ఈ ఘోరానికి పాల్పడుతున్నారు. అసలు ఏమైందీ సమాజానికి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi acp rape daughter in law  delhi rape cases  

Other Articles