Former deputy cm rajaiah visits appollo hospital another time for medical checkup

former deputy cm rajaiah, deputy cm rajaiah, rajaiah latest news, former deputy cm rajaiah heart attack, rajaiah appollo hospitals, rajaiah interview, rajaiah press meet

former deputy cm rajaiah visits appollo hospital another time for medical checkup

మరోసారి అపోలో ఆస్పత్రికి రాజయ్య... ఆందోనళలో సభ్యులు!

Posted: 01/28/2015 10:18 AM IST
Former deputy cm rajaiah visits appollo hospital another time for medical checkup

వైద్యఆరోగ్య శాఖలో అవినీతి పెచ్చుమీరిపోతోందంటూ గతకొన్నిరోజులుగా వార్తలు తీవ్రమైన తరుణంలో మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్తరఫ్ చేసిన విషయం విదితమే! ఈ విషయంపై మొదట స్పందించిన రాజయ్య.. వైద్యఆరోగ్యశాఖలో జరిగిన అవినీతిని పసిగట్టి కేసీఆర్ ఈ విధంగా వేటు వేశారని అన్నారు. కానీ తాను అవినీతికి పాల్పడలేదని, ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని, తాను తప్పుచేసినట్లుగా రుజువైతే ఎంతటి శిక్షను అనుభవించడానికైనా సిద్ధమేనని తెలిపారు. అయితే.. ఇంతలోనే ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. వెంటనే వైద్యులు చికిత్స అందించడంతో ఆయన సురక్షితంగానే బయటపడ్డారు. చికిత్స అయిన తర్వాత ఆయన ఇంటికి చేరుకున్నారు.

అయితే.. కేసీఆర్ ఆయన్ను నోటీసులు పంపకుండానే ఈ విధంగా వేటు వేయడంపై తీవ్ర మనోవేదనకు గురైన నేపథ్యంలో ఆ బాధ ఇంకా వెంటాడుతూనే వున్నట్లు వుంది. అందుకే.. మరోసారి ఆయన మరోసారి అపోలో ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. అయితే.. ఈసారి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. మంగళవారం సాయంత్రం గుండెపోటుతో అపోలోలో చేరిన రాజయ్యకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బీపీ, పల్స్ రేటు పెరిగినట్లు గుర్తించారు. అనంతరం డిశ్చార్జ్ చేశారు. కాగా.. వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి రావాల్సిందిగా అప్పుడే వైద్యులు సూచించడం జరిగింది. దాంతో ఆయన డాక్టర్ల సూచన మేరకు బుధవారం ఉదయం మరోసారి ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగానే వుందని డాక్టర్లు పేర్కొన్నట్లు సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles