Barack obama india tour soudi arabia narendra modi twitter which house retweet

barack obama india tour, barack obama india, barack obama news, narendra modi news, narendra modi twitter, narendra modi obama, barack obama narendra modi, america white house, white house twitter

barack obama india tour soudi arabia narendra modi twitter which house retweet : When barack obama has leave india.. narendra had tweet saying thank you to him for visiting india. which house also given reply to this.

ఒబామా భారత్ పర్యటనపై ‘వైట్ హౌస్’ స్పందన...

Posted: 01/28/2015 10:04 AM IST
Barack obama india tour soudi arabia narendra modi twitter which house retweet

గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా భారత్’కు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. మంగళవారం వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే! సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా మరణించిన నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్తరాజుగా సల్మాన్ నియమితులుకాగా.. ఆయనతో కలవడానికి ఆయన హుటాహుటినా ఆగ్రా పర్యటన రద్దు చేసుకొని వెళ్లాల్సి వచ్చింది. ఇలా ఒబామా భారత్ పర్యటనకు రావడం అమెరికా-ఇండియా మధ్య సంబంధాలు కొత్త శిఖరాలకు తీసుకెళ్లిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్ నుంచి ఒబామా సౌదీకి బయల్దేరిన అనంతరం ఆయన పర్యటనపై మోదీ ఈ మేరకు ట్విటర్’లో పేర్కొన్నారు.

ఒబామా పర్యటనపై మోదీ స్పందిస్తూ.. ‘‘ఒబామాకు వీడ్కోలు. మీ ప్రయాణం సురక్షితంగా జరగాలని ఆకాంక్షిస్తున్నా. మీ పర్యటనతో రెండుదేశాల సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయి’’ అని ట్విటర్’లో పోస్ట్ చేశారు. మోదీ చేసిన ఈ ట్వీట్’కు హర్షం వ్యక్తం చేస్తూ వైట్ హౌస్ కూడా స్పందించింది. ‘‘ఒబామా పర్యటనను ఎల్లకాలం గుర్తుండిపోయేలా మలిచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు మోదీ. ఆత్మీయ స్వాగతం పలికిన భారత ప్రజలకు మా కృతజ్ఞతలు’’ అంటూ అద్యక్షుడు కార్యాలయం బదులిచ్చింది. ఈ ట్వీట్’ను మోదీ తన ట్విటర్’లో పొందుపరిచారు. ఏదైతేనేం.. ఈ రెండు దేశాల మధ్య ఈవిధంగా సత్సంబంధం ఏర్పడ్డం భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలకు దారితీస్తుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : barack obama india tour  narendra modi twitter  america which house news  

Other Articles