Sacked rajaiah suffers heart stroke

rajaiah news, former deputy cm rajaiah, rajaiah health problems, rajaiah latest news, rajaiah photos, rajaiah gossips, rajaiah heart attack news, rajaiah heart attack, kadiyam srihari news, cm kcr news, telangana ministers

former Deputy Chief Minister Rajaiah, who was sacked by Telangana CM K.CR on Sunday on the charges of corruption was hospitalised on Tuesday evening suffering heart stroke

ITEMVIDEOS: మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్యకు గుండెపోటు..

Posted: 01/27/2015 08:29 PM IST
Sacked rajaiah suffers heart stroke

ఆదివారం పదవీచ్యుతుడైన తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. మంగళవారం సాయంత్రం తీవ్రమైన గుండెపోటుతో బాధపడ్డారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు తక్షణం హైదర్గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. అపోలో అస్పత్రి వైద్యులు రాజయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, పల్స్ రేటు పెరిగినట్టు  వైద్యులు గుర్తించారు. ఆయనను 24 గంటల పాటు వైద్యుల పరిశీలనలో ఉంచనున్నారు. రాజయ్యకు బీపీ, షుగర్ ఉన్నట్టు సమాచారం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అప్పటి ఉప ముఖ్యమంత్రి సహా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలను చూసుకుంటున్న రాజయ్యపై.. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయను పదవి నుంచి తొలగించారు. ఈ పదవిలో అదే సామాజిక వర్గానికి చెందిన వరంగల్ ఎంపీ కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రాజయ్యకు ఒక్కసారిగా చాతిలో నోప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆప్పత్రికి తరలించారు. రాజయ్య ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రులు ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  rajaiah  sacked  heart stroke  

Other Articles