Modi wears name on sleeve and suit

Modi wears name on sleeve and suit, Narendra Modi Suit Pin Stripes, Narendra Modi Suit During Obama Meeting, Narendra Modi Name in Suit, Narendra Damodardas Modi, narendra modi life, time magazine narendra modi, narendra modi speech, narendra modi biography, narendra modi facebook, narendra modi twitter, narendra modi latest news, narendra modi blog, narendra modi latest updates, narendra modi social media, narendra modi obama meet,

Prime Minister Narendra Modi, wore a monogrammed pin striped suit with his name — Narendra Damodardas Modi — forming the stripes.

మోడీ సూటపైనున్నవి చారలు కాదు.. మరేంటి..?

Posted: 01/27/2015 05:36 PM IST
Modi wears name on sleeve and suit

దేశాధినేతలు అగ్రరాజ్యాధి నేతలను కలిసేప్పుడు ఫలానా డ్రెస్ కోడ్ పాటించాలని ఎక్కడ నిబంధన లేకపోయినా.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను స్వాగతించేందుక వెళ్లిన ప్రధాని ప్రోటోకాల్ ను పక్కనబెట్టి మరీ స్వయంగా వెళ్లి ఆహ్వానాన్ని పలికారు. ఆ తరువాత రాష్ట్రపతి భవన్కు వచ్చినప్పుడు ప్రధాని నరేంద్రమోదీ ఓ నల్లటి బంద్ గలా సూట్ వేసుకున్నారు. అయితే దానిమీద బంగారు వర్ణంతో చారల్లాంటి డిజైన్ కనిపించింది. ఇదేంటో.. చారల సూటు అనే అంతా అనుకున్నారు. కానీ, ఆ ఫొటోలను క్లోజప్లో చూస్తే అసలు విషయం బయటపడింది. అదేంటంటారా..?

బంగారు వర్ణపు కాంతులతో చారలుగా కనబడుతున్నవి నిజానిక చారలు కావు. పసిడి వర్ణంతో ఎంబ్రాయిడరీ చేసిన ప్రధాని నరేంద్రమోడీ పేర్లే. వీటిని క్షణ్ణంగా గమనించిన ఓ ఫోటో గ్రాఫర్ తన కెమెరా లెన్సును జూమ్ చేసి ఫోటో తీయడంతో అసలు విషయం బయటపడింది. అయితే నరేంద్ర మోడీగా దేశ ప్రజలకు సుపరిచుతులైన ప్రధాని తన పూర్తి పేరును తన సూటుపై రాయించుకున్నారు. ఆయన పూర్తి పేరయిన నరేంద్ర దామోదర్దాస్ మోదీ అనే పేరును బంగారు వర్ణం అక్షరాలుగా దానిమీద ఎంబ్రాయిడిరీతో కుట్టారు.

తొలుత విమానాశ్రయానికి వెళ్లినప్పుడు కుర్తా పైజమా ధరించి, దానిమీద నెహ్రూ జాకెట్, శాలువా వేసుకుని వెళ్లారు. తర్వాత రాష్ట్రపతి భవన్లో అధికారికంగా స్వాగతం చెప్పేటప్పుడు మాత్రం సూటు మార్చుకున్నారు. అదే సూటుతో హైదరాబాద్ హౌస్లో 'చాయ్ పే చర్చా' కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ సూటును అహ్మదాబాద్కు చెందిన జేడ్ బ్లూ సంస్థ తయారుచేసింది. మోదీ దుస్తులన్నింటినీ వాళ్లే తయారు చేస్తారు. మోదీ కుర్తాలను డిజైన్ చేసింది కూడా వీళ్లేనని అంటారు. ఆ డిజైన్కు ఎంతగానో ముచ్చట పడిన ఒబామా.. ఆ తరహా కుర్తాలు వేసుకోవాలని తనకూ ఉన్నట్లు వెల్లడించారు. గతంలో ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ కూడా ఇలా తన పేరును సూటు మీద కుట్టించుకుని వేసుకున్నారు. ఆ తర్వాత ఇలా చేసింది మోదీ ఒక్కరేనని అంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : obama modi visit 2015  narendra modi  band gala suit  suit full of names  

Other Articles