China president jinping suggestions india

china president jinping news, pranab mukherjee news, narendra modi news, barack obama news, america states news, jinping press meet

china president jinping suggestions india : china president jinping suggestions india to stay awar from america and their states

భారత్’కు చైనా సందేశం : అమెరికా వలలో చిక్కుకోవద్దు!

Posted: 01/26/2015 07:24 PM IST
China president jinping suggestions india

భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విచ్చేసిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో ఒబామా, మోదీ మధ్య కొన్ని రహస్య ఒప్పందాలు జరిగాయి. తమ మధ్య జరిగిన రహస్య కార్యకలాపాలను గోప్యంగా వుంటేనే మంచిదని మోదీ పేర్కొన్నారు కూడా! ఏదైతేనేం.. ఒబామా రాకతో దేశంలో గణతంత్ర ఉత్సవాలు మరింత ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే.. ఒబామా రాకను జీర్ణించుకోలేకపోయిన చైనా ప్రభుత్వం.. భారత్’కు ఓ హెచ్చరికను జారీ చేసింది.

‘రిపబ్లిక్ డే’ సందర్భంగా చైనా భారత్’కు ఓ సందేశాన్ని అందజేసింది. అమెరికా, దాని మిత్రదేశాలు పన్నిన వలలో చిక్కుకోవద్దని చైనా సూచించింది. ఒబామా వ్యూహాత్మక రచనలతో దెబ్బతీసే అవకాశముందని, వాళ్లు వేసిన వలలో ఎట్టిపరిస్థితుల్లోనూ పడొద్దని, ముందుగా ఆలోచనలు - చర్చలు జరిపిన మేరకే అమెరికాతో ఒప్పందం కుదుర్చోవలసిందిగా ఆయన సలహాలు ఇచ్చారు. అలాగే.. భారత్’తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తేందుకు తాము సిద్ధంగా వున్నామని చైనా స్నేహహస్తం చాచింది. ఈ మేరకు చైనా అధ్యక్షుడు ఝి జిన్ పింగ్ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సందేశమిస్తూ.. భారత్’తో కలిసి శాంతిని పెంపొందించే దిశగా ప్రయత్నాలకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా.. బీజింగ్’కు వ్యతిరేకంగా న్యూఢిల్లీని ఉసిగొల్పేందుకు అమెరికా కుతంత్రాలకు, కుట్రాలకు పాల్పడుతోందంటూ గ్లోబల్ టైమ్స్, పీపుల్స్ డైలీ పత్రికల్లో ఓ వ్యాసం కూడా ప్రచురితమైంది. ఇప్పుడు ఆయన నేరుగా భారత్’కు అమెరికాతో జాగ్రత్తగా వుండాలంటూ సందేశం పంపించారు. ఈ విధంగా అమెరికాపై వ్యతిరేకంగా చైనా ప్రచారం చేయడం పెద్ద వివాదానికే దారితీస్తుందేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles