Four years old child save her mother life

four years old girl, child save mother life, america latest news, four years girl save mother

four years old child save her mother life : four years old child save her mother life by calling emergency while she is pregnant with 9 months

తల్లి ప్రాణాలు కాపాడిన నాలుగేళ్ల చిన్నారి!

Posted: 01/26/2015 05:45 PM IST
Four years old child save her mother life

ప్రాణాపాయ స్థితిలో వున్న తన తల్లిని నాలుగేళ్ల చిన్నారి తెలివిగా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమెను కాపాడింది. అమెరికాలోని మిచిగాన్ కలమజూ ప్రాంతానికి చెందిన కలైజ్ మానింగ్ అనే ఈ నాలుగేళ్ల చిన్నారి.. తన తల్లి ప్రాణాలను ఒక్క ఫోన్ కాల్’తో నిలిపింది.

9 నెలల నిండు గర్భిణి అయిన సెంటీరియా పురిటి నొప్పులతో కింద పడిపోయి విలవిల్లాడుతుండటాన్ని చూసిన ఆమె నాలుగేళ్ల కూతురు కలైజ్.. వెంటనే అత్యవసర సర్వీస్ నెంబర్ 911కి ఫోన్ చేసింది. ‘మా అమ్మ కింద పడిపోయి విలవిలలాడుతోంది. ఆమె పిల్లాడిని ప్రసవించనుంది. ఆమెకు వెంటనే సహాయం కావాలి. మీరు త్వరగా రండి’ అని ఆమె ఫోన్’లో చెప్పింది. దాంతో ఆమె ఫోన్ కాల్’కు స్పందించిన అత్యవసర సిబ్బంది.. వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుని సెంటీరియాను ఆస్ప్రతికి తరలించి ఆమె ప్రాణాలు కాపాడారు. ఇలా ఈ విధంగా ఆ నాలుగేళ్ల చిన్నారి తన తల్లి ప్రాణాలు కాపాడుకోగలిగింది.

మరోవైపు.. పురిటి నొప్పులతో బాధపడుతున్న సెంటీరియా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తన కూతురు వ్యవహరించిన తెలివికి ఎంతో మురిసిపోయింది. కేవలం ఈమె కాదు.. ఈమె తెలివిని గమనించిన మరికొందరు ఆమెకు అవార్డు కూడా ఇవ్వాలని ప్రతిపాదించారు కూడా!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles