The benefits with one rupee coin

one rupee coin, one rupee value, one rupee value, one rupee survey, one rupee polls, xerox copies, tooth pastes, shampoos

the benefits with one rupee coin : according to a survey.. the people had said that one rupee can use to buy different types of small things which we are using in our daily life.

‘ఒక్క రూపాయే’ అని తీసిపారేయకండి.. ఎన్నో లాభాలున్నాయి!

Posted: 01/26/2015 03:33 PM IST
The benefits with one rupee coin

ప్రస్తుతరోజుల్లో ‘ఒక్క రూపాయి’ అంటే ప్రతిఒక్కరు ఎంతో తేలికగా తీసిపారేస్తారు. ‘అసలు ఒక్క రూపాయితో ఏం వస్తుంది..? కనీసం ఒక కప్ చాయ్ కూడా దాంతో కొనలేం!’ అని అంటుంటారు. అంతెందుకు.. చిన్నపిల్లలకు ఒక రూపాయి ఇచ్చి ఏమైనా కొనుక్కో! అని ఇస్తే.. దాంతో ఏం వస్తుంది..? అంటూ తిరిగి ప్రశ్నించే రోజులివి! అయితే.. ఆ ఒక్క రూపాయితోనే ఎన్నో ప్రయోజనాలు వున్నాయని ఒక సంస్థ తన సర్వే ద్వారా తెలుపుతోంది.

‘అసలు ఒక్క రూపాయికి ఏమి వస్తుంది?’ అనే ప్రశ్నను సంధిస్తూ ఓ సంస్థ సర్వే నిర్వహించగా.. అందులో ప్రజలు ఇచ్చిన సమాధానాలు చాలా ఆసక్తికరంగా వెల్లడయ్యాయి. అవేమిటంటే.. ఒక్క రూపాయితో కొనగలిగే వాటిల్లో అత్యధిక విలువను చొక్కా గుండీలకు ఆపాదించారట! దాని తర్వాతి స్థానం కాఫీ పౌచ్’లదే! పని ఒత్తిడి, నిద్రమత్తులో వున్నప్పుడు ఆ రెండింటిని దూరం చేసుకోవడం కోసం కాఫీ ఉపయోగపడుతుంది కదా..! అంటూ సమాధానాలు చెబుతున్నారు. కేవలం ఇవే కాదు.. ఇంకా చాలా వున్నాయి.

ఒక్క రూపాయితో రెవెన్యూ స్టాంపులు, క్యాడ్’బరీ చాక్లెట్, లోకల్ టెలిఫోన్ కాల్, షాంపూ సాషే, తలకు పెట్టుకునే నూనెలు, సేఫ్టీ పిన్స్, పేపర్ పిన్స్, వాషింగ్ పౌడర్ సాషే, ఇంటర్నెట్ నుంచి ప్రింట్ అవుట్, జిరాక్స్ కాపీ, తలనొప్పి మాత్ర, బొట్టు బిళ్లలు, కుంకుమ, పసుపు సాషేలు, మౌత్ రిఫ్రెషనర్లు, వక్కపొడి... ఇలా ఎన్నో కొనుగోలు చేయవచ్చునని ప్రజలు తెలిపారు. అంతేకాదు.. చివర శీర్షికగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అదేమిటంటే.. పై వస్తువులన్నీ కొనుగోలు చేయలేని ఎడల ఆ రూపాయిని చిల్లర రూపంలో వుంచుకోవచ్చని చెబుతున్నారు. ఇదీ రూపాయి సామర్థ్యం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : one rupee coin survey  telugu news  

Other Articles