Talks on bilateral investment treaty to resume say modi obama

obama and modi talks, obama modi in hyderabad house, obama modi visit 2015, barrack obama, obama modi press meet, america president barrack obama, palam airport, narendra modi, prime minister modi, red carpet welcome, india welcomed obama, michelle obama, american first lady michelle obama, modi hugs obama, obama shake hands modi, pakistan media, pak media says big development, pranab mukharjee,

India and US will resume dialogue on a bilateral investment treaty as the economic growth in both countries is becoming stronger and their economic partnership had strengthening, announced Prime Minister Narendra Modi and US President Barack Obama Sunday.

భారత్ అమెరికా సంబంధాల్లో నవశకం..

Posted: 01/25/2015 08:53 PM IST
Talks on bilateral investment treaty to resume say modi obama

భారత ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ఒబామా సంయుక్తంగా పాల్గొన్న మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు నమస్తే..! మేరా ప్యారా భారత్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. మోదీ చాయ్‌పే చర్చలో తనను ఆహ్వానించినందుకు సంతోషంగా వుందన్నారు. రెండు దేశాలు ప్రజల సాధికారతకు పాటు పాడాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్, అమెరికా స్నేహసంబంధాల్లో కొత్త శకం ప్రారంభమయిందని ఒబామా అన్నారు. రక్షణ, ఆర్థిక, వాణిజ్య రంగాల్లో పరస్పరం సహరించుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఉక్రెయిన్‌లో సైనికజోక్యం వుండదని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు.

రష్యా బలహీనపడటం లేక ఆ దేశ ఆర్థిక వ్యవస్థ గాడితప్పడం వంటి అంశాలపై తమకు ఎలాంటి ఆసక్తి లేదన్నారు. యెమెన్‌లో ఉగ్రవాద శిబిరాలపై దాడులు కొనసాగుతాయని ఆయన స్పష్టంచేశారు.  పరిశుభ్రమైన ఇంధనం కోసం కృషి చేస్తామన్నారు, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో భారత్ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. రక్షణ ఒప్పందాలను మరో 10 ఏళ్లు పొడిగిస్తామని ఆయన చెప్పారు. భారత ప్రజలతో రేడియోలో నేరుగా మాట్లాడుతానని ఒబామా తెలిపారు. ఒకే పదవీ కాలంలో రెండుసార్లు వచ్చిన మొదటి అధ్యక్షుడిని నేనే. రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.

రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరిగింది. అణు విస్తరణ విషయంలో కూడా రెండు దేశాల మధ్య బంధం బలోపేతమైంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య 100 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోందని ఇది మరింత పెరగాలని ఆశిస్తున్నామన్నారు. ఇండియాతో మరింత హైటెక్ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. స్వచ్ఛమైన ఇంధనం విషయంలో కూడా మా సహకారం ఉంటుందని తెలిపారు. రెండు దేశాల సంయుక్త ప్రాజెక్టులు మరిన్ని ప్రారంభం అవుతాయన్నారు.

భారత్- అమెరికాల మధ్య సంబంధాల్లో నవశకం ప్రారంభమయిందని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఒబామాతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో ముందుగా మాట్లాడుతూ ఒప్పందం కుదిరిన ఆరుసంవత్సరాలకు మరింత ముందుకు పోవడం హర్షణీయమన్నారు. రక్షణ ప్రాజెక్టుల్లో కూడా ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవాల్సివుందన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరం వుందన్నారు. ప్రతి దేశం ఉగ్రవాదాన్ని రూపుమాపాలని కోరారు. పరిశుభ్రమైన ఇంధన వనరుల కోసం అమెరికా కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇరుదేశాల మధ్య ఆర్థికసంబంధాలు మరింత పటిష్టం కావాల్సిన అవసరం వుందన్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో తనకు ప్రత్యేకమైన అనుబంధం వుందన్నారు. తరచుగా ఒబామాతో ఫోన్‌లో మాట్లాడటంతో పాటు సరదా సంభాషణలు కూడా చేస్తామని ఆయన పేర్కొన్నారు. అమెరికాకు వెళ్లినప్పుడు తనను ఒక బాలీవుడ్ నటుడికి స్వాగతం పలికిన రీతిలో స్వాగతించారని మోదీ వెల్లడించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : obama modi visit 2015  hyderabad house  joint pressmeet  chai pe charcha  

Other Articles