Obama modi talks in hyderabad house pakistan media says big development

obama and modi talks, obama modi in hyderabad house, obama modi visit 2015, barrack obama, america president barrack obama, palam airport, narendra modi, prime minister modi, red carpet welcome, india welcomed obama, michelle obama, american first lady michelle obama, modi hugs obama, obama shake hands modi, pakistan media, pak media says big development, pranab mukharjee,

obama modi talks in hyderabad house, pakistan media says big development

హైదరాబాద్ హౌస్ లో చర్చలు.. అతిపెద్ద పరిణామంటున్న పాక్

Posted: 01/25/2015 06:40 PM IST
Obama modi talks in hyderabad house pakistan media says big development

భారత్, అమెరికాల మధ్య ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పౌర అణు ఒప్పందం ఖరారైపోయింది. ఇందులో అత్యంత ముఖ్యమైన 'ట్రాకింగ్ క్లాజు'ను తొలగించేందుకు అమెరికా అంగీకరించడం ఇందులోని ప్రధానాంశం. భారత అణు ఉపయోగాన్ని తాము పరిశీలించబోమని అమెరికా చెప్పడం మన దేశంలోని చాలామందిని సంతృప్తి పరిచే అవకాశం ఉంది. ఒబామా తన విశేషాధికారాలను ఉపయోగించుకుని ఈ క్లాజును తొలగించినట్లు సమాచారం. దీంతో ఇతర దేశాల నుంచి తెచ్చుకున్న అణు సామగ్రిని అమెరికా కంపెనీలు సరఫరా చేసిన రియాక్టర్లలో ఎలా ఉపయోగిస్తున్నారన్న విషయాన్ని కూడా అగ్రరాజ్యం ట్రాక్ చేయబోదు దీంతో పాటు అనేక అంశాలపై ప్రధాని నరేంద్రమోదీ, అధ్యక్షుడు ఒబామాల మధ్య ఇంకా పలు అంశాలపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇరుదేశాల మధ్య వాణిజ్య బంధాలను బలోపేతం చేసుకోవడం, రక్షణ రంగ సహకారం లాంటి విషయాలపైనా ఒప్పందాలు కుదరొచ్చని అంటున్నారు.

కాగా, బరాక్ ఒబామా భారత పర్యటనపై పాకిస్థాన్ మీడియా కూడా అమితాసక్తి కనబరిచింది. ఒబామా భారత పర్యటనను 'అతిపెద్ద పరిణామం'గా పాకిస్థాన్ పత్రికలు వర్ణించాయి. భారత్-అమెరికా సంబంధాల్లో మొదలైన నూతన అధ్యాయంతో తమకు నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇస్లామాబాద్  పై ఉందని పాకిస్థాన్ ప్రభుత్వానికి సూచించాయి. భారత గణతంత్ర వేడుకలకు ఒబామా ముఖ్య అతిథిగా హాజరు కానుండడం అతిపెద్ద పరిణామమని 'డైలీ టైమ్స్'  పేర్కొంది. అమెరికా వ్యూహాత్మకంగా భారత్, పాకిస్థాన్ లతో సంబంధాలు కొనసాగిస్తోందని వెల్లడించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : obama modi visit 2015  hyderabad house  pakistan media  

Other Articles