Kcr decides to oust rajaiah induct kadiam srihari instead

telangana chief minister, telangana CM KCR, telangana deputy cm, telangana deputy cm rajaiah, telangana deputy cm kadiyam srihari, Rajaiah ministry ousted, kadiyam into cabinet, rajaiah ousted from cabinet, kadiyam swear in as deputy chief minister, Thatikonda rajaiah, kadiyam srihari, kcr shuffles ministries, jagadeeshwar reddy, lakshma reddy, governer narasimhan,

telangana chief minister KCR decides to oust rajaiah induct kadiam srihari instead

రాజయ్యపై వేటు, కడియంకు చోటు..మంత్రివర్గంలోనూ మార్పులు..

Posted: 01/25/2015 04:40 PM IST
Kcr decides to oust rajaiah induct kadiam srihari instead

తెలంగాణ ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు, ఇవాళ ఉదయం పార్టీ ముఖ్యనేతలో భేటీ అయిన రాష్ట్రంలో తాజా పరిణామాలపై ఆయన వారితో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి పార్టీ పార్లమెంటు సభ్యుడు కడియం శ్రీహరిని పిలిపిచారు. ఆ తరువాత వెనువెంటనే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనంతరం ఉపముఖ్యమంత్రిగా వున్న తాటికొండ రాజయ్యను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ముఖ్యమంత్రి సిఫార్సుతో గవర్నర్ నరసింహన్ రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించినట్లు ప్రకటించారు, వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. అందుకే ఆ శాఖను నిర్వర్తిస్తున్న డాక్టర్ రాజయ్యను తప్పించారు.

ఆ వెంటనే వడివడిగా మంత్రివర్గానికి సంబంధించిన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజయ్య సామాజిక వర్గానికి చెందిన వరంగల్ పార్లమెంటు సభ్యుడు కడియం శ్రీహరికి ఉపముఖ్యమంత్రి పదవి కేటాయించాలని నిర్ణయం తీసుకున్న కేసీఆర్ ప్రభుత్వం.. వెంటనే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా గవర్నర్ నరసింహన్ కు తెలియపర్చింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. గవర్నర్ నరసింహన్, కడియం శ్రీహరి చేత ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ శ్రీకారం చేయించారు.

రాజ్‌భవన్‌లో జరిగిన కడియం శ్రీహరి ప్రమాణస్వీకారానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, ఈటెల, జోగు రామన్న, ఎంపీ కేకే తదితరులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తాను భాగస్వామినవుతానని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు కష్టపడి సైనికుడిలా పనిచేస్తానని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రిగా సీఎం ఆశీస్సులతో ప్రమాణ స్వీకారం చేశానన్నారు.

ఇటీవల రాష్ట్రంలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను తొలగిస్తూ నిర్ణయం తీసకున్న కేసీఆర్ ప్రభుత్వం ఆ తరువాత మంత్రుల శాఖలను కూడా మారుస్తూ పలు మార్పలు చేసింది. తాజాగా, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కడియం శ్రీహరికి విద్యా శాఖ, మరో మంత్రి లక్ష్మారెడ్డికి వైద్య ఆరోగ్య శాఖను, జగదీశ్వర రెడ్డికి విద్యుత్ శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : telangana  cm kcr  deputy cm rajaiah  kadiam srihari  

Other Articles