Obama pays homage to mahatma

obama homage to mahatma, obama lays wreath at bapu ghat, obama modi visit 2015, barrack obama, america president barrack obama, palam airport, narendra modi, prime minister modi, red carpet welcome, india welcomed obama, michelle obama, american first lady michelle obama, modi hugs obama, obama shake hands modi,

american president barrack obama lays wreath at rajghat pays homage to bapuji

రాజ్ ఘాట్ వద్ద మహాత్మునికి నివాళులర్పించిన ఒబామా

Posted: 01/25/2015 04:38 PM IST
Obama pays homage to mahatma

రాజ్ భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులతో కలసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంతకు ముందు త్రివిధ దళాల నుంచి గౌరవ సైనిక వందనం స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి ఆయన నేరుగా రాజ్ఘాట్కు చేరుకుని, అక్కడ పూజ్య బాపూజీ మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. బాపూ సమాధి మీద పుష్పగుచ్ఛం ఉంచి మౌనంగా ప్రార్థన చేశారు. సమాధి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి, పూలు సమర్పించారు. అనంతరం పియూష్ గోయల్ తదితరులకు అభివాదం చేసి అక్కడి నుంచి బయల్దేరారు.

కేవలం సాక్సులతోనే ఒబామా రాజ్ ఘాట్ వద్దకు వచ్చి, నివాళులు అర్పించడం గమనార్హం. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాశారు. ఆ తరువాత రాజ్ ఘాట్ లో రావి మొక్కను నాటారు. గతంలో ఒకసారి భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఒబామా బాపూజీకి నివాళులు అర్పించారు. ఇరుదేశాలకు చెందిన భద్రతా దళాల అధికారులతో పాటు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తదితరులు కూడా ఒబామా వెంట ఉన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : obama modi visit 2015  mahatma gandhi  homage  

Other Articles