Telangana folk singer activist desapati srinivas fires on director puri jagannath

telangana folk singer desapati srinivas, director puri jagannath, director puri jagannath latest news, desapati srinivas latest news, desapati srinivas controversial comments, desapai srinivas fires puri jagannath, puri jagannath desapati srinivas

telangana folk singer activist desapati srinivas fires on director puri jagannath

ITEMVIDEOS: పూరీ.. వాచిపోతుందంటూ హెచ్చరిక.!

Posted: 01/24/2015 04:11 PM IST
Telangana folk singer activist desapati srinivas fires on director puri jagannath

జానపద గాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత దేశపతి శ్రీనివాస్ కు కోపం వచ్చింది. సభ్య సమాజాంలో మహిళలకు రక్షణ కరువు అవుతుందన్న ఆంశంపై ఓ వేదికపై మాట్లాడుతున్న ఆయన అకస్మాత్తుగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సభ్య సమాజం పెడదారి పట్టేందుకు కారణం పూరీ జగన్నాథ్ లాంటి వారేనంటూ ఆయన ఊగిపోయారు. ఇందుకు పూరి ఇటీవల చేసిన వ్యాఖ్యలే అయన కోపానికి కారణమయ్యాయి. యువత పెడత్రోవ పట్టడానికి ఆయన లాంటి వారే కారణమంటూ దేశపతి తీవ్రంగా మండిపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలో జిల్లాల్లో దేశపతి మహిళకు ఇవ్వాల్సిన గౌరవాన్ని వివరిస్తూ స్వయంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ వేదికపై మాట్లాడుతూ.. సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు, అత్యాచారాలకు సినిమాలే కారణమంటూ ఆయన ప్రసంగించారు. అంతలోనే ఆయనకు దర్శకుడు పూరీజగన్నాథ్ వ్యాఖ్యలు గుర్తుకోచ్చాయి. ఇక వాటిపై ఆయన తమ మాటల తూటాలను ఎక్కుపెట్టాడు. ఒక దశలో దర్శకుడిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఇప్పుడు దర్శకుడు తనకు కనబడితే.. ముందు లెంపలు (చెంప దెబ్బలు) కోట్టిన తరువాతే ఆయనతో మాట్లాడతానన్నారు. అదీ ఒక్కటో రెండు కాదు.. నాలుగైదు లెంపకాయలు వేసిన తరువాతేనన్నారు.

వున్నఫలంగా పూరీపై దేశపతి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి కూడా కారణం లేకపోలేదు. సందేశాత్మక, చారిత్రాత్మక సినిమాలను తీస్తే తెలుగు ప్రజలు ఆదరించరని, అందుచేత హాస్య, శృంగారాలతో పాటు ఫైట్స్, ఇలా నవరసాలను కలపి సినిమాను తీస్తామని చెప్పాడు. సందేశాత్మక చిత్రాలతో ఆదర్శంగా నిలవాలన్న యావలో పడితే.. సినిమా వ్యాపారాలను చేయలేమని కూడా పూరీ చెప్పుకోచ్చారు. వినోదాత్మకమైన చిత్రాలను చూడటానికి మాత్రమే ప్రజలు ఇష్టపడతారని, దానిని దృష్టిలో పెట్టుకునే చిత్రాలను తెరకెక్కిస్తున్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సందేశాత్మక చిత్రాలను చూసేవాళ్లు కూడా చాలా తక్కువే. ఎలాగో భారతదేశంలో కూడా పాశ్చాత్య సంప్రదాయం వచ్చేసింది కాబట్టి.. వాటికనుగూణంగానే చిత్రాలను నిర్మిస్తామని ఆయన చెప్పుకోచ్చారు. సినీ దర్శకుడిగా ఆయన అభిప్రాయాలు ఆయనవి.

అయితే దేశపతి శ్రీనివాస్ కు ఆగ్రహం రావడంలో కూడా అర్థం వుంది. సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, దారుణాలకు సినిమాలు, టీవీ సిరియల్స్ కారణం అన్నారు. సినిమాలలో చూపెడతున్న విపరీత దోరణితోనే సభ్య సమాజంలో మహిళలకు రక్షణ కరువయ్యిందన్నారు. సినిమాల్లో మహిళలను కించపరిచే విధంగా పలు సన్నివేశాలు తెరకెక్కడంతోనే సగటు యువకుడి వాటిని అన్వయించుకుని మహిళలపై, యువతులపై నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ముఖ్యంగా హీరోయిన్లనైతే చిట్టిపోట్టి బట్టలు వేసుకోవడం, సముద్ర తీరాల్లో ఇసుకమీద ఈడ్చుకెళ్లేటటువంటి దారుణమైన సంస్కృతి ఈనాటి సినిమాల్లో నడుస్తోందని అన్నారు. ఆ విధంగా తెరకెక్కే మూవీలను ప్రోత్సహించకూడదని దేశపతి తెలిపారు. భారత దేశ సంప్రదాయాలకు, సంస్కృతికి దర్శణం పట్టేలా.. స్త్రీలకు గౌరవిస్తూ, కుటుంబ నేపథ్యంలో తీసిని సినిమాలు చూడాలని సూచించారు. ఇలాంటి చిత్రాలకు కూడా తీసిన దర్శకులు హిట్లు కోట్టారని దేశపతి పేర్కొన్నారు.

జి.మనోహర్ - AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles