Three suns in sky

Three Suns in Mongolia, Anthelian, optical phenomenon of Sun, celestial phenomenon of Sun, Anthelian phenomenon. wonder in space, three suns in sky, two suns in sky,

Mongolia witnessed not one but three Suns in the sky.

ITEMVIDEOS: నింగిలో ముగ్గురు సూర్యులు.. ఖగోళంలో అద్భుతం..

Posted: 01/24/2015 12:40 PM IST
Three suns in sky

ఖగోళంలో అద్భుతం చోటుచేసుకుంది. మంగోళియాలో ఒకే సమయంలో ముగ్గురు సూర్యులు అవిష్కృతమయ్యారు. ఇవాళ తెల్లవారు జామున ఒక్కరిగానే ఉండాల్సిన సూర్యని చూసి అక్కడి వారు ఖంగుతిన్నారు. ఒక్కరికి బదులు ముగ్గురు సూర్యలు ఉదయించడంతో అక్కడి వారు సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలుతున్నారు. తామెంతో అదృష్టం చేసుకున్నందునే ఇలా సూర్యభగవానుడి తమకు దర్శనం కల్గించాడని అంటున్నారు.

కాగా నిజానికి ఖగోళ ఆఫ్టికల్ దృగ్విషయం ఏర్పడటంతోనే మంగోళియాలో ముగ్గురు సూర్యులు ఆవిష్కరించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంథిలియన్ కారణంగానే మంగోళియాలో ముగ్గురు సూర్యలు కనబడుతున్నారని వారు వివరించారు. అంథీలియన్ అంటే సూర్యుడు అత్యంత ఎత్తున ఉదయిస్తున్న క్రమంలో రవి నుంచి వెలుతురు నుంచి వచ్చే ప్రతిబింభాలు గాలిలోని మంచు స్పటికాలు ద్వారా ప్రయాణించిన సమయంలో ఉత్పన్నమయ్యే కాంతే సూర్యుడి మాదిరిగా కనబడుతుందని, అంత మాత్రమే ముగ్గురు సూర్యులు ఉదయించినట్లు కాదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ ఆప్టికల్ దృగ్విషయం అత్యంత అరుదుగా సంభవింస్తుందని.. ఆ సమయాల్లోనే సూర్యుడు రెండుగా మూడుగా కనిపిస్తుంటాడని తెలిపారు సుమారు ఐదేళ్ల క్రితం చైనాలో ఈశాన్య ప్రాంతంలో కూడా ఇద్దరు సూర్యులు ఉదయించారని తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles