Cpi suravaram sudhakar reddy fires on nda government

Suravaram Sudhakar Reddy fires on NDA government, CPI fires on NDA government, NDA governance is similar to UPA2, modi government is similar to UPA2, Modi escaping from retrieval of back money, modi failed to bring black money, Suravaram Sudhakar Reddy, PM Narendra Modi, CPI General Secretary, Modi failed in solving former issues,

CPI General Secretary Survaram Sudhakar commented that NDA governance is as similar as UPA2 ruling. He claimed PM Narendra Modi is escaping from retrieval of back money and failed in solving former issues .

నరేంద్రమోడీ ప్రభుత్వం దానికి కొనసాగింపేనట..

Posted: 01/20/2015 07:30 PM IST
Cpi suravaram sudhakar reddy fires on nda government

ప్రధాని నరేంద్ర మోదీ ఏడు నెలల పాలనపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి తీవ్రంగా విమర్శించారు. నరేంద్ర మోడీ పాలన యూపీఏ పాలనకు కొనసాగింపుగా ఉందన్నారు. మరో మాటగా చెప్పాలంటూ మోడీ ప్రభుత్వం యూపీఏ -3 వలే ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల వాగ్ధానాలలో భాగంగా వంద రోజుల్లో నల్లధనం వెనక్కు తీసుకువస్తామన్న మోడీ విఫలమయ్యారని ఆరోపించారు. ఇప్పుడు మోడీ కానీ అయన ప్రభుత్వం కానీ అసలు నల్లధనం ఊసు లేకుండా అభివృద్ది అంటూ జప చేస్తున్నారని సురవరం దుయ్యబట్టారు.

మోదీ ఏడునెలల పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న పలు శక్తుల పట్ల మోడీ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. పనిలో పనిగా ఆయన మాజీ ఐఎఎస్ అదికారిని, బీజేపి ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం అంటూ వేదికలెక్కిన కిరణ్ బేడీ.. ఎట్టకేలకు తన నిజస్వరూపాన్ని బయటపెట్టారన్నారు. కేవలం ముఖ్యమంత్రి పదవి కోసమే కిరణ్ బేడీ బీజేపిలో చేరారని విమర్శించారు.

సీపీఐ చీలినప్పటి నుంచే వామపక్షలు బలహీనపడుతున్నాయని ఆయన సుధాకర్రెడ్డి గుర్తు చేశారు. వామపక్షాల ఐక్యత మా ప్రధాన అజెండా అని ఆయన స్పష్టం చేశారు. సీపీఐ సెంట్రల్ కమిటీ కొత్త రాజకీయ విధానం ప్రవేశపెట్టిందని తెలిపారు. తెలంగాణలో నిజాం చరిత్రతో పాటు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను కూడా పాఠ్యాంశాలుగా చేర్చాలని సురవరం సుధాకర్ రెడ్డి ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suravaram Sudhakar Reddy  cpi general secretary  modi  kiran bedi  

Other Articles