రింగో... స్మార్ట్ ఇంటర్నేషనల్ కాలింగ్ యాప్ భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ రింగో యాప్‌తో ఇంటర్నెట్, వైఫై లేకుండానే ఇంటర్నేషనల్ కాల్స్ చేసుకోవచ్చు. 16 దేశాల్లో విజయవంతమైన ఈ యాప్ ఇప్పుడు భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ రింగో యాప్ కారణంగా ఇంటర్నేషనల్ కాలింగ్‌లో 90% పొదుపు చేయవచ్చు. తమ రింగో యాప్‌తో ప్రపంచంతో భారతీయుల కమ్యూనికేషన్ విషయంలో పెనుమార్పు వస్తుందన్న ధీమాను రింగో సీఈఓ భవిన్ తురకియా వ్యక్తం చేశారు.
ఇతర ఓటీటీ వాయిస్ యాప్‌ల వలె రింగో కాల్స్‌కు ఇంటర్నెట్, వైఫై, డేటా అవసరం లేదని వివరించారు. భారత్‌లోని రింగో యూజర్, ఇంగ్లాండ్‌లోని వ్యక్తికి ఫోన్ చేయాలనుకున్నట్లైతే, రింగో భారత యూజర్‌కు లోకల్ కాల్‌ను డయల్ చేస్తుంది. అలాగే ఇంగ్లాండ్‌లోని యూజర్‌కు కూడా లోకల్ కాల్‌ను డయల్ చేస్తుంది. ఈ ఇరువురిని కేరియర్ సర్క్యూట్ల ద్వారా అనుసంధానం చేస్తుందని వివరించారు. ఏడాదికి భారతీయులు 200 కోట్ల డాలర్లు విదేశీ కాల్స్ కోసం వెచ్చిస్తున్నారని భవిన్ పేర్కొన్నారు. తమ సంస్థ అందజేస్తున్న కాల్ చార్జీలు మిగతా మొబైల్ పోన్ల కంటే 70 శాతం చౌకని తెలిపారు. ఇంటెర్ నెట్ ఆధారిత స్కైప్, వైబర్‌తో పోల్చితే 25% తక్కువని తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Feb 21 | ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ తీవ్రమైన అస్వస్థతకి గురయ్యాడు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్ - గచ్చీబౌలీలోని ఏఐజీ హాస్పిటల్ కు తరలించారు. అస్పత్రి వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ పై చికిత్స... Read more
Feb 21 | పుల్వామా ఉగ్రదాడి ఆమెనూ కదిలించింది.. కన్నీరు పెట్టించింది! ఆమె భారతీయురాలు అయితే అందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. కానీ ఆమె పాకిస్థానీ. భారత్‌పై వ్యతిరేకత నరనరాన జీర్ణించుకున్న గడ్డపై పుట్టి పెరిగిన అమ్మాయి. పేరు... Read more
Feb 21 | బంగ్లాదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించి సుమారు 70 మంది సజీవ దహనమయ్యారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో క్రితంరోజు సంభవించిన ఈ ఘటనలో మరో 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల అర్థనాధాలు,... Read more
Feb 21 | భారతదేశంలోనే అత్యంత వేగగామి ట్రైన్ గా పేరుగాంచిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు వేగాన్ని అంచనా వేయడంలో నాలుకు ఖర్చుకున్న ఓ వాహనదారుడు.. చివరకు తన ప్రాణాలు దక్కించుకుంటే చాలు అని భావించి..... Read more
Feb 21 | జమ్మూకాశ్మీర్ లోని పూల్వామా జిల్లాలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషై మహమ్మద్ సంస్థ మావనబాంబుకు పాల్పడిన ఘటన విషాదం నుంచి దేశం కోలుకోకముందే.. అంతకన్నా తీవ్రస్థాయిలో మరో దాడికి ఐఎస్ఐతో కలసి అదే... Read more