Gopala gopala movie overseas collections report

gopala gopala movie news, gopala gopala movie collections, gopala gopala overseas collections, gopala gopala first day collections, gopala gopala 3 days collections, gopala gopala first week collections, gopala gopala worldwide collections, gopala gopala movie news, pawan kalyan latest news, daggubati venkatesh latest news, tollywood trade reports, gopala gopala trade reports, gopala gopala collections

gopala gopala movie overseas collections report : According to overseas trade reports.. Gopala Gopala movie has collected more than 585 thousand dollars in just two days in foreign countries

ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు ‘గోపాలుడి’ వరాలు

Posted: 01/12/2015 10:58 AM IST
Gopala gopala movie overseas collections report

పవన్ కల్యాణ్ - వెంకటేష్ కాంబోలో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ ‘గోపాలా గోపాలా’ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే! ఈ సినిమాకి ఫ్యాన్స్ షో నుంచి పాజిటివ్ రెస్సాన్స్ రావడంతో.. దిగ్విజయంగా మూవీ దూసుకుపోతోంది. అన్ని ఏరియాల్లోనూ భారీగా కలెక్షన్లను రాబడుతోంది. మొదటిరోజు కలెక్షన్లలో ‘అత్తారింటికి దారేది’ చిత్రం రికార్డును బద్దలు కొట్టకపోయినా.. అన్ని ఏరియాల్లో హౌస్’ఫుల్ బోర్డుతో నడుస్తోంది.

కేవలం తెలుగునాటలోనే కాదు.. ఓవర్సీస్’లో కూడా ఈ మూవీ మొదటి రెండురోజుల్లోనే భారీ కలెక్షన్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ మూవీ మొదటి రెండు రోజుల్లో $585 వేల డాలర్స్ (ఇండియన కరెన్సీ ప్రకారం సుమారు 3 కోట్ల 65 లక్షలు) కలెక్ట్ చేసిందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మరో మూడురోజుల్లో 1 మిలియన్ డాలర్ మార్క్’ని టచ్ చేసే అవకాశం వుందని అంటున్నారు. ఇక రెండు రోజుల్లోనే మంచి కలెక్షన్లను రాబట్టినందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఓవర్సీస్ రిపోర్ట్ (93 లోకేషన్స్) :
శనివారం – $ 281,000
ఆదివారం – $ 304,000

ఇక తెలుగునాటలో మొదటిరోజు ఈ మూవీ అన్ని ఏరియాల్లో కలిపి 9 కోట్ల 19 లక్షలు కలెక్ట్ చేసిందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. హిందీలో తెరకెక్కిన ‘ఓ మై గాడ్’ మూవీకి ఈ చిత్రం రీమేక్ అయినప్పటికీ తెలుగునాటతోపాటు ఓవర్సీస్’లో కూడా భారీగా కలెక్షన్లు రాబట్టడానికి ‘పవన్-వెంకీ’ కలిసి నటించడమేనని అంటున్నారు. అంతేకాదు.. ఇందులో పవన్ నిడివి కాస్త ఎక్కువగా పెంచడంతోబాటు వారిద్దరి మధ్య వున్న కొన్ని సీన్స్ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ అని అంటున్నారు. ఏదైతేనేం.. చివరికి గోపాలా ఆడియెన్స్’ని ఆనందపర్చడంతోబాటు డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంటలను పండిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles