Crda bill approved by ap assembly

crda bill, andhra pradesh crda, crda bill approved, ap capital bill, andhra pradesh crda bill, n chandra babu naidu, ap capital, ap assembly recent news

The bill, meant to create the CRDA with the authority to prepare a perspective plan for capital of ap

ఎ పి శాసన సభలో సి.ఆర్.డి.ఏ బిల్లు ఆమోదం

Posted: 12/22/2014 11:37 PM IST
Crda bill approved by ap assembly

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించిన కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(సీఆర్డీఏ) బిల్లును ఎట్టకేలకు ఈ రోజు శాసనసభలో ఆమోదించారు. రాష్ట్ర రాజధాని విషయంలో ఆంద్రప్రదేశ్ శాసన సభలో రాజధాని ప్రాంత అబివృద్ది బిల్లు (కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అధారిటి బిల్లును) ప్రవేశపెట్టారు. వెయ్యికోట్ల మూలధనం, 250 కోట్ల రివాల్వింగ్ ధనంతో ఈ సంస్థ ఏర్పాటు అవుతుందని బిల్లులో తెలిపారు. ముప్పై ఏళ్ల సమగ్ర అబివృద్ది కోసం ఈ అధారిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలియచేశారు.

ఈ బిల్లు ద్వారా భూ సేకరణ ను కూడా చట్టబద్దం చేయాలని సంకల్పించారు. ఎపి ప్రభుత్వం కొత్తగా భూ సమీకరణ విధానానికి తెర తీసిన నేపధ్యంలో ఈ బిల్లు కీలకమవుతుంది. అప్పుడు భూములను అధికారికంగా సేకరించటానికి వీలు కలుగుతుంది. ఇప్పటికే రాజధాని కోసం భూసేకరణ పనులు మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో రాజధాని కోసం ఏర్పడే ఈ సంస్థకు ఉండే అధికారాలు, బాధ్యతలు మొదలైన వివరాలను పొందుపరిచారు. ఈ అదారిటీ పరిధిలోకి వచ్చే నగరాలు, పట్టణాలు,గ్రామాల వివరాలు తెలిపారు. రాజధాని నిర్మాణ బాధ్యతను ఈ సంస్థ స్వీకరిస్తుంది. ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదించారు. బిల్లులోని రైతు వ్యతిరేక విధానాలను, భూములు అదనంగా తీసుకోవడాన్ని వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకించింది. కాని మూజువాణి ఓటు తో బిల్లు ను ఆమోదింపజేశారు.

గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలో ఏపీ కొత్త రాజధానిని నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ రెండు మండలాలలోని 29 గ్రామాలలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరిస్తారు. 17 చాప్టర్లు, 117 పేజీలతో సీఆర్డీఏ బిల్లును రూపొందించారు.

 

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap assembly  crda bill  approved  

Other Articles