Congress leader venkat swamy passed away

Senior Congress leader G. Venkat Swamy, Venkat Swamy passed away, kaka passed away, congress leader kaka, venkat swamy latest news, venkat swamy death news, venkat swamy history, venkat swamy hospitalised, former union minister venkat swamy, venkat swamy political career, former state minister venkat swamy, banjarahills care hospital

Senior Congress leader G. Venkat Swamy passed away. Earlier he was admitted to Care hospital due to age related ailment and was in a critical health condition.

కాంగ్రెస్ కురువృద్దుడు వెంకటస్వామి (కాకా) కన్నుమూత

Posted: 12/22/2014 09:19 PM IST
Congress leader venkat swamy passed away

కాంగ్రెస్ కురువృద్దుడు, సీనియర్ నేత జి.వెంకటస్వామి(90) కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా కేర్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న ఆయన. ఆరోగ్య పరిస్థతి విషమించడంతో.. నిన్న రాత్రి వైద్యులు ఆయనను అక్యూట్ ఇంటెన్సివ్ కేర్ వార్డుకు తరలించారు. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న ఆయనకు వెంటిలేటర్ ద్వారా శ్వాసను అందించారు. అయినా.. వృద్దాప్యం మీద పడటంతో వైద్య చికిత్సలకు వెంకటస్వామి సహకరించలేకపోయారు. దీంతో ఆయన ఇవాళ రాత్రి కన్నుమూశారు.


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/venkatswamy

1957, 1978లలో ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. 1967లో తొలిసారిగా పెద్దపల్లి నుంచి ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన 7 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. పలుసార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. స్వర్గీయ మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. దీంతో పాటు ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా పలు శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. కాంగ్రెస్ కురువృద్ద నేత కావడంతో  ఆయనను కాంగ్రెస్ నేతలు ముద్దుగా కాకా అని పిలుచుకుంటారు. కాకా మరణంతో కాంగ్రెస్ కార్యకర్తలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయనకు ఇద్దరు కుమారులు వినోద్ , వివేక్ ఇద్దరు గతంలో చట్టసభలకు ఎన్నికయ్యారు. వీరితో పాటు వెంకటస్వామికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

వెంకటస్వామి కాకా రాజకీయ ప్రస్థానం..

1957-62, 1978-84 మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1967లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1969-71 పబ్లిక్ అకౌంట్స్ కమిటి సభ్యుడిగా పనిచేశారు. 1971లో రెండోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1973 ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు కేంద్ర కార్మిక, పునరావాస సహాయ మంత్రిగా పనిచేశారు. 1973 నవంబర్ నుంచి 1977 మార్చి వరకు కేంద్ర ప్రజా పంపిణీ, పునరావాస సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1977లో మూడోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1978-1982 మధ్య ఆంధ్రప్రదేశ్ కార్మిక, పౌరసరఫరాలశాఖ మంత్రిగా పనిచేశారు.  1982-1984 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్(ఐ) కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో నాలుగోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1990-1991 మధ్య సంక్షేమ, షెడ్యూల్‌కులాలు, గిరిజన కమిటీ సభ్యుడిగా, పరిశ్రమలశాఖ మంత్రిగా పనిచేశారు. 1991లో అయిదోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1991 జూన్ 21 నుంచి 1993 జనవరి 17 మధ్య కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రిగా పనిచేశారు. 1993 జనవరి 18 నుంచి 1995 ఫిబ్రవరి 10 వరకు కేంద్ర టెక్స్‌టైల్స్ (స్వతంత్రహోదా)శాఖ మంత్రిగా పనిచేశారు. 1995 ఫిబ్రవరి 10 నుంచి 1995 సెప్టెంబర్ 15 వరకు కేంద్ర టెక్స్‌టైల్స్‌శాఖ మంత్రిగా పనిచేశారు. 1995 సెప్టెంబర్ 15 నుంచి 1996 మే 10 వరకు కేంద్ర కార్మికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1996లో ఆరోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2002-2004లో ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు. 2004లో తిరిగి ఏడోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles