Action should be taken on conversion and re conversion people

action on conversion, action on conversion people, action on conversion people by states, venkaiah naidu, union minister venkaiah naidu, venkaiah naidu in rajya sabha, venkaiah naidu in parliament, center not in favor on conversion, center not encouraging conversion, uproar in parliament, uproar in rajyasabha, uproar over conversion bill, prime minister narendra modi

action should be taken on conversion and re conversion people by states says union minister venkaiah naidu. states that center is not encouraging any kind of it.

మత మార్పిడులను ప్రోత్సహించే వారిపై చర్యలు

Posted: 12/22/2014 02:44 PM IST
Action should be taken on conversion and re conversion people

మత మార్పిడుల అంశం మరోసారి రాజ్యసభకు కుదిపేసింది. మతమార్పిడుల బిల్లుపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతుండడంతో రాజ్యసభలో వాయిదా పర్వం కొనసాగింది. ఇవాళ ఉదయ సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు మత మార్పిడి బిల్లుపై చర్చకు పట్టుబట్టారు. చైర్మన్ పోడియం వద్ద ప్రతిపక్ష సభ్యులు బైఠాయించారు. మత మార్పిడులపై ప్రధాని నరేంద్రమోడీ ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో జోక్యం చేసుకున్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మతమార్పిడిలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించబోదని అన్నారు. మతమార్పిడిలు లేదా మరోసారి మార్పిడిలకు కేంద్రం మద్దతు ఇవ్వబోదని సోమవారం ఆయన లోక్సభలో చెప్పారు.

మతమార్పిడిలను ఆపే బాధ్యత రాష్ట్రాలదే అన్నారు. మతమార్పిడిలను ప్రోత్సహించే వారిపై రాష్ట్రాలు చర్య తీసుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలు పట్టువీడకపోవడంతో సభలో గందరగోళం రేగింది. దీంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. వాయిదా తర్వాత సభ ప్రారంభంకాగానే మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో ఛైర్మన్ తిరిగి వాయిదా వేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkaiah naidu  conversion  lok sabha  rajya sabha  Narendra modi  Conversions' issue  uproar  

Other Articles