Jagan says he will met formers in andhra pradesh and will do rythu odarpu yatra

rythu odarpu yatra, odarpu yatra, ys jagan mohan reddy recent news, y s jagan total properties, ys jagan cbi charge sheets, recent news about ys jagan, jagan met formers in andhra pradesh, opposition leader ys jagan, n chandra babu naidu, ys jagan vs chandra babu

jagan says he will met formers in andhra pradesh, and will do rythu odarpu yatra, He met with the farmers who lost their crops due to the recent incessant rains and consoled them.

చెల్లె 'తండ్రి' ఓదార్పు యాత్ర... అన్న 'రైతు' ఓదార్పు యాత్ర..!!

Posted: 12/22/2014 02:15 PM IST
Jagan says he will met formers in andhra pradesh and will do rythu odarpu yatra

ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ ఇప్పటికే తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్పు యాత్ర పేరు తో పలువురిని పరామర్శిస్తూ.., ఇప్పటికి పూర్తి కాని ఆ యాత్ర  సగం పూర్తి చేసి.. తర్వాత ఎన్నికలు సమీపించటం.., ఎన్నికలలో చేదు ఫలితాలను చవి చూడటం.., లాంటి పరిణామాలు ఎదురుకావటం తో ఇంకా ఆ ఓదార్పు యాత్ర ను ఆప్తికి ఆపేసి ఈనికల తర్వాత మిగిలిన పరామర్శ యాత్రను తన చెల్లెలికి అప్పగించిన విషయం విదితమే... మల్లి ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా రుణమాఫీ అని చెప్పి అధికారం లోకి వచ్చిన తెలుగు దేశం పార్టీ, ముఖ్య మంత్రి చంద్రబాబు రుణమాఫీ సరిగా చేయక ఆర్థికంగా ఇబ్బంది పడి చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.., ఆ జాబితాను త్వరలోనే శాసన సభ స్పీకర్ కి సమర్పించి, రైతుల ఆత్మహత్యలు ఏ విధంగా ఉన్నాయో ప్రభుత్వానికి తెలియ జేస్తామని.., ఇప్పటికే పలువురు రైతులు కరవుతో అల్లాడుతున్నారని.., ఇంకా వారిపై గుండె పై రాయేసినట్లుగా ఈ రుణమాఫీ కాదని తెలుసుకున్న రైతులు ఎంతో దిగులు చెందుతున్నారని.., అలాంటి వారందరినీ తను స్వయంగా వెళ్లి రైతు కుటుంబాలను ఓదార్చుతానని జగన్ ప్రకటించారు.

కరువు మండలాలను ఆలస్యంగా ప్రకటించారని, అది కూడా కేవలం 226 మండలాలకే పరిమితం చేశారని అన్నారు. సకాలంలో కరువు ప్రణాళిక సిద్దం చేయలేదని అన్నారు.కరువ ప్రకటన కూడా అసెంబ్లీ ముందు రోజు మాత్రమే వచ్చిందని అన్నారు.ఆత్మహత్యలు చేసుకున్నవారికి సాయం చేసే పరిస్థితి కూడా ప్రభుత్వపరంగా లేకుండా చేశారని అన్నారు.చంద్రబాబు ప్రభుత్వాన్ని చూస్తుంటే భయం వేస్తోందని అన్నారు.గ తంలో కూడా మద్యపాన నిషేధం అన్నారని, దాని ప్రాతిపదికగా పన్నులు వేశారని, తిరిగి మద్య నిషేధం కూడా ఎత్తివేశారని అన్నారు. ఇప్పుడు ఇసుక దర షాక్ కొడుతోందని అన్నారు. రైతుల నెత్తిన కరెంటు బిల్లులు బాదుతున్నారని అన్నారు. రైతుల రుణమాపీలను పూర్తిగా చేయాలని కోరుతున్నామని అన్నారు. రైతులను ఇబ్బంది పెడితే తాము సహించేది లేదని తమ పార్టీ తరపున వాళ్ళకు మద్దతుగా వారి పక్షాన పోరాడతామని తెలిపారు. ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా కొనసా...గుతున్న ఓదార్పుయాత్ర పూర్తి కాక చెల్లమ్మకు ఆ భారాన్ని కట్టబెట్టిన ఆ అన్నయ్య.., మళ్ళి ఓదార్పు ఈ యాత్ర ఎన్ని రోజులకు ముగుస్తుందోనని అని, పనిలో పనిగా అమ్మకు ఓ యాత్ర ఇస్తే ఆమె కూడా ఇంక ప్రజల్లో తిరగొచ్చని ప్రజలు చర్చించుకుంటున్నారు.  


హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ys jagan mohan reddy  opposition leader  n chandra babu naidu  ap cm  rythu odarpu yatra  

Other Articles