Ap minister yanamala brother threating us alleges hacthery owner

ap minister yanamala, minister yanamala brother, yanamal krishnudu threating, yanamal krishnudu threating for money, yanamal krishnudu threating hatcheries, yanamal krishnudu cashing hatchries, krishnudu destroyed priyanaka hatchery, priyanaka hatchery chandramouli, chandramouli complaints police, chandramouli complaints HRC

ap minister yanamala brother krishnudu threating us to kill for money and destroyed the hatchery alleges priyanka hacthery owner chandramouli

యనమలపై చర్యలకు చంద్రబాబు సాహసిస్తారా..?

Posted: 12/22/2014 01:59 PM IST
Ap minister yanamala brother threating us alleges hacthery owner

ఆయన మంత్రివర్యులు. అంతేకాదు అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ ఆయన ద్వితీయస్థానాన్ని అక్రమించారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తరువాత స్థానంలో వున్న యనమల రామకృషుడు ఇప్పుడు ఆయన తమ్ముడి వల్ల ఇబ్బందుల్లో పడుతున్నారు. ఆయన అండ చూసుకుని ఆతని తమ్ముడు రాజమండ్రి హేచిరీల నుండి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. డబ్బు ఇవ్వని వారిని చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. మంత్రిగారి తమ్ముడి హోదాతో పాటు తుని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి హోదాను కూడా వెలగబెడుతున్న యనమల కృష్ణుడి బెదింపులు శృతిమించుతున్నాయి. అధికారంలో వున్న పార్టీ అండతో తానేం చేసినా చెల్లుతుందన్నట్లు కృష్ణుడు చెలరేగిపోతున్నాడన్న ఆరోపణలు వినబడుతున్నాయి.

హేచరిల ఏర్పాటులో వున్న నిబంధనలను ఆసరాగా చేసుకుని అక్రమంగా ఏర్పాటు చేసిన హేచరీల నుంచి పది లక్షల రూపాయల చోప్పున డబ్బు వసూలు చేస్తున్న యనమల కృష్ణుడిపై పోలీసులు కేసు నమోదు చేస్తారా..? అందుకు కనీసం సాహసిస్తారా..? అంటే కూడా లేదనే సమాధానమే వినబడుతోంది. ఎందుకంటే ఆయనగారు మంత్రిగారి తమ్ముడు. ఎం చేసినా..? ఎలా చేసినా..? తాను బయటపడగలననే ధైర్యం అతనికి వుంది. అక్రమంగా ఏర్పాటు చేసిన హేచరీలపై చర్యలు తీసుకోవాలన్న అలోచనే వుంటే..? వాటిపై ఇప్పుడున్న తమ ప్రభుత్వ హయంలో చర్యలు చేపట్టడం అంత కష్టతరమన పనేం కాదు. అయితే హేచరీలు నడవాలి కానీ లాభాలు మాత్రం తమకే చెందాలన్న విధంగా యనమల కృష్ణుడు వ్యవహరిస్తున్నారని హేచరీ యజమానులు అరోపిస్తున్నారు. చచ్చి చెడి, నానా కష్టాలు పడి తాము సంపాదించినదంతా రాజకీయ రాబంధులకే దోచిపెట్టాల్సి వస్తుందని వారు అవేదన వ్యక్తం చేశారు.

పది లక్షల రూపాయలు ఇస్తావా లేక చస్తావా అంటూ యనమల కృష్ణుడు తనను బెదిరిస్తున్నారని ప్రియాంక హేచరీ యజమాని గుణ్ణం చంద్రమౌళి ఆరోపించారు. ఈమేరకు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన యనమల కృష్ణుడిపై అనేక ఆరోపణలు చేశారు. హేచరీల నుంచి యనమల కృష్ణుడు భారీగా వసూలు చేశారని, తనను కూడా పది లక్షలు రూపాయలు అడిగారని చెప్పారు. తాను అంత డబ్బు ఇవ్వలేనని చెప్పినా.. డబ్బు ఇవ్వాల్సిందేనని బెదిరింపులకు పాల్పడుతున్నాడని చంద్రబమౌళి చెప్పారు. డబ్బు ఇవ్వలేదన్న కోపంతో రౌడీలను పంపి హేచరీ ధ్వంసం చేయించారని ఆరోపించారు. చంపుతానని బెదిరిస్తున్నారని చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని
పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు.

మానవ హక్కుల కమిషన్‌కూ ఫిర్యాదు చేశానని చంద్రమౌళి చెప్పారు. వాస్తవానికి.. తొండంగి, యు.కొత్తపల్లి మండలం పరిధిలో చాలా వరకూ హేచరీలు అనుమతులు లేకుండా సీఆర్‌జెడ్‌ నిబంధనలను ఉల్లంఘించి నడుపుతున్నారు. ఇదే అదనుగా మంత్రి యనమల సోదరుడు కృష్ణుడు.. హేచరీ యజమానుల నుంచి భారీగా వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దానవాయిపేటలోని ప్రియాంక హేచరీపై దాడి జరగడం గమనార్హం. ఈ ఘటనపై తొండంగి పోలీస్‌స్టేషన్లో కేసు నమోదైంది. అయితే పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసులో తన పేరు లేకుండా కృష్ణుడు చేసుకున్నారని హేచరీ యజమాని ఆరోపిస్తున్నారు.

ఇదిలా వుంటే ఎన్నికలకు ముందు.. పార్టీ అధినేత చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీని ఈ విషయంలో నిలబెట్టుకుంటారా..? అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. తన హయాంలో ఒక్క పైసా కూడా అవినీతి జరగకుండా చర్యలు తీసుకుంటామని, రాష్ట్రంలో ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడతామని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చారు కాబట్టి తన మాటను నిలబెట్టకుంటారా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తన తరువాతి స్థానంలో వున్న యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు విషయంలో చంద్రబాబు ఎలా స్పందించారు. పార్టీ పదవిని కొనసాగిస్తారా..? అతనిపై చర్యలు తీసుకోమ్మని చంద్రబాబు పోలీసులకు చెబుతారా..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. యనమల కృష్ణుడి విషయంలో చంద్రబాబు ఎలా స్పందిస్తారన్న విషయం ఇప్పడు రాజకీయ వర్గాల్లో చర్చీనీయాంశంగా మారింది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ తీరును అన్ని అంశాల్లో తప్పుబడుతున్న విపక్షాలకు యనమల కృష్ణుడి అంశం అందిన ద్రాక్షాలా మారనుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yanamal krishnudu  priyanaka hatchery chandramouli  police  money  

Other Articles