Counting of votes for j k jharkhand assembly elections tomorrow

jammu kashmir assembly elections counting, jharkand assembly elections counting, bjp majority in jharkhand, hung assembly in jammu and kashmir, exit polls survey, assembly election results, voters decide candidates fate, five phase elections,

Counting of votes for the five-phased assembly elections in the states of Jammu and Kashmir and Jharkhand will begin on Tuesday

తేలనున్న అభ్యర్థుల భవితవ్యం.. ఓటరు తీర్పు బట్టభయలు

Posted: 12/22/2014 12:47 PM IST
Counting of votes for j k jharkhand assembly elections tomorrow

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. ఐదు దశల్లో జరిగిన జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల భవితవ్యం తేలపోనుంది. ఓటరు తీర్పు కోసం అనేక రకాల హామీలు, అమ్యామ్యాలు కురిపించినా.. ఓటరు ఎవరిని విశ్వసిస్తారన్నది కూడా రేపు బట్టభయలు కానుంది. జార్ఖండ్ లోని 81 అసెంబ్లీ స్థానాలకు 24 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరిపేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇందుకోసం నాలుగు వేల మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. జార్ఖండ్ లో 66 శాతం ఓటింగ్ నమోదు 70 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అదికారులు ఇప్పటికే ప్రకటించారు.

అటు ఎన్నికలను బహిష్కరించాలన్న తీవ్రవాదులు హెచ్చరికలను కూడా ఖాతరు చేయకుండా మునుపెన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో ఓటింగ్ నమోదు చేసుకున్న జమ్మూకాశ్మీర్ లో చివరి విడతలో మొత్తంగా 76 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ కూడా ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. వేర్పాటు వాదులకు భారత ప్రజాస్వామ్యానికి మధ్య పోటీలా సాగిన ఈ ఎన్నికలలో జమ్మూకాశ్మీర్ ప్రజలు భారత దేశం తరపునే నిలిచారు. మొత్తంగా ైదు విడతల ఎన్నికలలో 66 శాతం మంది ప్రజలు భారత ప్రజాస్వామ్యాన్ని స్వాగతిస్తున్నారురని తేటతెల్లమైంది. కాగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడులకు భయాందోళకకు గురైన కాశ్మీర్ వాసులు ఓటింగ్ లో పాల్గొనేందుకు సాహసించలేకపోయారు. ఉగ్రవాదులు కాల్పులు లేని పక్షంలో మరో పదిహేను నుంచి పద్దెనిమిది శాతం ఓటింగ్ పెరిగేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదిలావుండగా ఎగ్జిట్ పోల్స్ మాత్రం జమ్ము కాశ్మీర్ లో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని స్పష్టం చేశాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 27-33 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ 32-38 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనా వేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ 4-10 స్థానాలతోను, అధికార నేషనల్ కాన్ఫరెన్స్ 8-14 స్థానాలతోను సరిపెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అంటే.. ఈసారి అధికార మార్పిడి తథ్యమని తేల్చారు. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో మొత్తం 87 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ అధికారం చేపట్టాలంటే కనీసం 44 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.

అటు జార్ఖండ్ బీజేపీ పాగా వేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా రెండు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించగా, రెండూ కమలానికే పట్టంగట్టాయి. ఏబీపీ నీల్సన్ సంస్థ నిర్వహించిన పోల్స్లో.. బీజేపీ 52, జేఎంఎం 10, కాంగ్రెస్ పార్టీ 9, జేవీఎం 6, ఇతరులు 4 స్థానాలు గెలుచుకుంటారని చెప్పారు. ఇక ఇండియాటుడే నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో అయితే బీజేపీ 41-49, జేఎంఎం 15-19, కాంగ్రెస్ 7-11, జీవీఎం 0, ఇతరులు 8-12 స్థానాలు గెలుచుకుంటారని చెప్పారు. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu kashmir  assembly elections  votes counting  jharkhand elections  

Other Articles