Pakistan hangs 4 terrorists convicted of attack on musharraf

Pakistan hangs 4 terrorists, four terrorists executed, pakistan executes four terrorists, Pakistan started executing terrorists, 4 terrorists convicted of attack, 4 terrorists convicted hanged, 4 terrorists convicted Musharraf attack, former Pakistan President Pervez Musharraf, 4 terrorists convicted hanged, 4 hanged in faisalabad,

Four prisoners, convicted for attacking former Pakistan President Pervez Musharraf, were executed on Sunday at a district jail in Faisalabad.

ముషరఫ్ పై దాడి కేసులో నలుగురు ఉగ్రవాదులకు ఉరి

Posted: 12/21/2014 09:16 PM IST
Pakistan hangs 4 terrorists convicted of attack on musharraf

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పై దాడి కేసులో నిందుతులైన నలుగురి తీవ్రవాదుల్ని ఇవాళ ఉరితీశారు. ఉరిశిక్ష అమలులో భాగంగా  ఫైసలాబాద్ సెంట్రల్ జైల్ శిక్ష అనుభవిస్తున్నఆ నిందితుల్ని నిన్న రాత్రి  జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో ఉబర్ అహ్మద్, రషీద్ ఖురేషీ, గులామ్ సర్వార్ భట్టి మరియ రష్యా వాసి అక్విలేక్యూ అహ్మద్ ల నిందితులుగా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఆ నిందితులను ఉరితీసే క్రమంలో వారి చివరి కోరికను మన్నించి వారి కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతి ఇచ్చారు. అనంతరం జిల్లా జైలు మార్గంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి వారిని ఉరితీసినట్లు జైలు అధికారులు తెలిపారు.
 
ఉరిశిక్షపై వున్న తాత్కాలిక విరామాన్ని ఎత్తివేసిన తరువాత ఈ కేసుకు సంబంధించి ఇద్దరు తీవ్రవాదులను ఇప్పటికే ఉరితీశారు. కాగా  కోట్ లాక్ పేట్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న మరో నలుగురు ఉగ్రవాదులను ఉరితీసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ నలుగురు నిందితుల్ని మరో ఒకటి రెండు రోజుల్లో ఉరితీసే అవకాశం ఉందని సమాచారం. పెషావర్ ఘటనతో కళ్లు తెరచిన పాకిస్థాన్ ఉరిశిక్షపై వున్న తాత్కాలిక విరామాన్ని ఎత్తివేసింది. అప్పటి నుంచి అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉగ్రవాదుల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parvez musharraf  bomb attack  assassination attempt  pakistan  

Other Articles