Every man will face first love feel in his life

first love feel, first love, love is life, one boy and girl in one place, one boy journey, one girl journey

every person will face love feeling in his entire life

అబ్బాయిలకు ప్రత్యేకం: జీవితంలో ప్రతిఒక్కరు ఎదుర్కొనే సంఘటన!

Posted: 12/20/2014 06:19 PM IST
Every man will face first love feel in his life

కొన్ని కొన్ని సార్లు..,  కొన్ని కొన్ని సంఘటనలు మనకు జీవితంలో అనుకోకుండా జరిగిపోతుంటాయి... కొన్ని కొన్ని మనం కల్పించుకొని మరీ చేస్తుంటాం. అందులో కొన్ని ముగిసిపోతుంటాయి.. అలాంటివి మనం జీవిత కాలనుగమనంలో మరచిపోతుంటాం కూడా... అయితే కొన్ని ప్రత్యేకమైనవి మనల్ని జీవితాంతం వెంటాడుతుంటాయి.. కొన్ని అందులో మధురానుభూతులుగా మిగిలిపోతే మరికొన్నిటికి విషాదాన్ని తోడుగా చేసుకొని వీడ్కోలు పలకాల్సి ఉంటుంది... అలాగే రోజులో ఎంతోమందిని కలుస్తుంటాం... పొద్దున్న నిద్ర లేచిన దగ్గరునుండి రాత్రి పడుకోబోయే వరకు రోజువారీ క్రమంలో ఎంతో మందిని చూస్తాం... ఎంతో మందిని పలకరిస్తాం... అందులో మనకు కావలసిన వాళ్ళు ఉండచ్చు.., చిన్న పిల్లలు ఉండచ్చు.., పెద్దవాళ్ళు ఉండచ్చు.., అబ్బాయిలు ఉండచ్చు..,  "అమ్మాయిలు" ఉండచ్చు.., ఎవరైనా ఉండచ్చు. అందులో కొన్ని పరిచయాలు తాత్కాలికంగా ముగుస్తాయి.. మరికొన్ని కాకతాళియకంగా మనతో శాశ్వతంగా ఉండిపోతాయి... అసలు విషయానికి వస్తే.....

మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడో.... పొద్దున్నే ఏ గుళ్లోనే.., ఏ టిఫిన్ సెంటర్ లోనో.., ఏ కాఫీ షాప్ లోనో.., ఏ రెస్టారెంట్ లోనో.., ఏ షాపింగ్ మాల్ లోనో.., మనం పని చేసే ఆఫీస్ లోనో.., ఇంకా యూత్ గా చెప్పాలి అంటే ఏ పబ్ లోనో.., ఎదో ఒక రోజు.., ఎక్కడో ఒక చోటా.., ఎవరో ఒక అమ్మాయిని చూస్తాం... ఎక్కడో మనసుకు నచ్చుతుంది.. (కొందరు అనుకుంటారు..ప్రతి అమ్మాయిని చూస్తుంటాం నాకైతే ప్రతి అందంగా ఉన్న అమ్మాయి నచ్చుతుందని... దానికి వేరే పేరు ఉంది దాన్నే కామం అంటారు అది వేరు... ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే మగతనం వేరు.., మనసు వేరు.., మనసులో ఫీలింగ్స్ వేరు)...., (ఇంకా, కొందరంటారు నేను చూస్తాను.., అందాన్ని ఆస్వాదిస్తాను, అక్కడే వదిలేస్తాను అని. "అందాన్ని" ఆస్వాదించే అర్ధవంతమైన అబ్బాయి "బంధాన్ని" గౌరవిస్తాడన్న నమ్మకం ఉంటుందేమో) ఎందర్నో అమ్మాయిలను చూసిన మనకు ఎక్కడోచోట ఒక అమ్మాయి ప్రత్యేకంగా అనిపిస్తుంది.. శరీరం షాక్ కొట్టినట్లు అవుతుంది..,చూపులు బాణాలవుతాయి.., చేతులు చేసిన పనినే మల్లి మల్లి చేస్తాయి... ఆ సమయంలో మన శరీరంలో సరిగ్గా పని చేసే పార్ట్ ఏదైనా ఉంది అంటే అవి కన్నులే..., అమ్మాయి కూడా చూస్తుంది.. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అసలు అమ్మాయి చూస్తుంది అంటే ఆమెకి.., ఆమె మనసుకి తప్ప రెండో వాడికి తెలియనే తెలియదు.. (అమ్మాయి చూపును ఆదివిష్ణువు కూడా కనిపెట్టలేడు) ప్రాచీన యుగం నుండి .., ప్రస్తుత యుగం వరకు అమ్మాయి చూపుకు అర్ధం కనిపెట్టలేదు... కనిపెట్టలేడు కూడా.., కాని ఆ అమ్మాయి చూసే చూపు ఉంటుంది చూడు.., ఆ చూపు ని ఎన్ని బాషలలో వర్ణించిన, ఎన్ని అక్షరాలు ఉపయోగించినా.., ఎన్ని భావాలలో విశదికరించినా..,  ఇంకా తక్కువే అన్న అనుభూతి కలుగుతుంది... ఇద్దరు చూస్తారు చూస్తారు.. చూసుకుంటూనే ఉంటారు... టిఫిన్ షాప్ లో టిఫిన్ చేయటం అయిపోయేంత లోపు... కాఫీ షాపు లో కాఫీ తాగేంతలోపు.... షాపింగ్ మాల్ లో కొనాల్సినవి కొనేసి బిల్ అయిపోయేంతలోపు.., రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చినవి ఆరగించేలోపు.., ఈ చూపులు కొనసాగుతూనే ఉంటాయి........

అక్కడ మొదలవుతుంది అసలు విషయం.. అయిపోయేంతలోపు కొనసాగిన చూపులన్నీ అయిపోగానే మనకు ప్రత్యేకంగా కనిపించిన ఆ అమ్మాయి దూరంగా వెళ్తుంది అని తెలుసుకోగానే.., మనసు మదన పడుతుంది.. యద లోపల యుద్ధం ప్రారంభవుతుంది... అమ్మాయి దగ్గరికి వెళ్లాలా వద్దా.. వెళ్తే భయం, అసలు ఏం అవుతుందోనని.. ఈ సమయంలోనే గడచిపోయిన క్షణాలు తిరిగొస్తే బాగుండనిపిస్తుంది.., ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ దొరికితే బాగుండు అనిపిస్తుంది... ఫాలో అయితే బాగుండు అనిపిస్తుంది.., కాని చేయలేము... సంస్కారం అడ్డొస్తుంది.., భయం భయపెడుతుంది.. సంస్కార భయం, సమాజ భయం రెండూ ఉంటాయి... ఇంకా ఆ ఆధ్యాయం అక్కడితో అంతం అవుతుంది.. ఆ "చిన్న ప్రేమ కథ" అంతటితో ఆగిపోతుంది... అప్పటికప్పుడు పుట్టే ప్రేమ ఎంత వరకు వాస్తవమో మనకు తెలియదు కాని.., ఇలాంటి సంఘటన జీవితంలో ప్రతి ఒక్కరికి తారసపడుతుంది. కానీ కొందరి జీవితాల్లో ఇలాంటి సంఘటనలు సక్సెస్ అయిన సందర్భాలు ఉంటాయి... లైఫ్ లో లక్షణంగా సెటిల్ అయి, "లక్ష్యాలు" తీరిపోయి "లక్షలు" సంపాదించే సమయం వచ్చాక.., ఇంక కావాల్సిన తంతు ఒక్కటే మిగిలి ఉంది అని అనుకున్న ధైర్యశాలి ఇక్కడ ధైర్యం చేస్తాడు.. అడుగు ముందుకు వేసి అమ్మాయి దగ్గరకి వెళ్తాడు.. ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా.., లేకపోతే ఒక ఓర చూపు చూసేసి వెళ్ళిపోతుందా.., ఓర్పు తో సాధ్యం కాదని సమాధానం చెప్పి వెళ్ళిపోతుందా..,  అనేది ఆ తర్వాత ఆలోచన.. అప్పటికప్పుడు అక్కడ కావాల్సింది అడుగు వేయటం.. ధైర్యంగా మాట్లాడటం...

హరికాంత్ రామిడి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(4 votes)
Tags : one boy and one girl  first love feel  everyone will face this experience  

Other Articles