Capital regional development authority bill tabled in ap assembly

andhra pradesh assembly, andhra pradesh government tabled a bill, andhra pradesh government, capital regional development authority, CRDA bill in assembly

The Andhra Pradesh Government tabled the Capital Regional Development Authority (CRDA) Bill in the state Assembly

ఎపి అసెంబ్లీలో కీలకమైన రాజధాని సంస్థ బిల్లు

Posted: 12/20/2014 01:53 PM IST
Capital regional development authority bill tabled in ap assembly

ఎపి రాష్ట్ర రాజధాని పట్ల వేగిరంగా అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. దానిలో భాగంగానే రాష్ట్ర రాజధాని విషయంలో ఆంద్రప్రదేశ్ శాసన సభలో రాజధాని ప్రాంత అబివృద్ది బిల్లు (కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అధారిటి బిల్లును) ప్రవేశపెట్టారు. వెయ్యికోట్ల మూలధనం, 250 కోట్ల రివాల్వింగ్ ధనంతో ఈ సంస్థ ఏర్పాటు అవుతుందని బిల్లులో తెలిపారు. ముప్పై ఏళ్ల సమగ్ర అబివృద్ది కోసం ఈ అధారిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలియచేశారు. ఈ బిల్లు ఆమోదం పొందితే,విజయవాడ ,గుంటూరు,తెనాలి పట్టణాభివృద్ది సంస్థకు చెందిన వివిధ ఆస్తులు దీని పరిధిలోకి వస్తాయి.ముఖ్యమంత్రి అద్యక్షతన దీని పర్యవేక్షక కమిటీ ఉంటుంది.

ఈ బిల్లు ద్వారా భూ సేకరణ ను కూడా చట్టబద్దం చేయాలని సంకల్పించారు. ఎపి ప్రభుత్వం కొత్తగా భూ సమీకరణ విధానానికి తెర తీసిన నేపధ్యంలో ఈ బిల్లు కీలకమవుతుంది. అప్పుడు భూములను అధికారికంగా సేకరించటానికి వీలు కలుగుతుంది. ఇప్పటికే రాజధాని కోసం భూసేకరణ పనులు మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో రాజధాని కోసం ఏర్పడే ఈ సంస్థకు ఉండే అధికారాలు, బాధ్యతలు మొదలైన వివరాలను పొందుపరిచారు. ఈ అదారిటీ పరిధిలోకి వచ్చే నగరాలు, పట్టణాలు,గ్రామాల వివరాలు తెలిపారు. రాజధాని నిర్మాణ బాధ్యతను ఈ సంస్థ స్వీకరిస్తుంది. రాజధాని నిర్మాణ బాధ్యతే కాకా కేంద్రం దగ్గర రాజధానికి అవసరమైన నిధుల సేకరణకు కూడా కృషి చేసే అవకాశం ఉంది.  

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles