Telangana government passed an ordinance regarding parliamentary secretary posts

telangana goverment, k chandra shekar rao, parliamentary secretary, ordinence, governer, telangana parliamentary secretary posts

telanagana government passed an ordinance regarding parliamentary secretary posts for who unemployeed politicians

తెలంగాణాలో మంత్రులు కాని మంత్రులు వస్తున్నారు...!!

Posted: 12/20/2014 10:15 AM IST
Telangana government passed an ordinance regarding parliamentary secretary posts

తెలంగాణాలో ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణ పూర్తయ్యిన విషయం తెలిసిందే. కాని కొందరికి మంత్రి పదవి లభించక, అందరి ముందు తమ అసంతృప్తి ని బహిరంగాగానే వెల్లడిస్తున్నారు. పలు ఎం.ఎల్.ఏ లు మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కాని వారికి ఇవ్వటం సాధ్యం కాదని కొందరి వలస నేతలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని కనుక మీరందరూ పార్టీ కోసం కష్ట పడాలని కెసిఆర్ వాళ్ళకు ప్రత్యేకంగా పిలిచి మరీ చెప్పినట్లు సమాచారం. కాని కొందరు ఎం.ఎల్.ఏ లకు పార్లమెంట్ సెక్రటరీ లుగా అవకశం కల్పిస్తామని చెప్పి, పార్లమెంట్ కార్యదర్శులను నియమించాలని అనుకున్న వెంటనే ఆయన మంత్రి వర్గ సమవేశంలో దానిపై తీర్మానం చేశారు. దానికి సంబంధించిన బిల్లును వేగంగా ఆమోదించేలా చేశారు. దాని వెంటనే ఆ ఆమోదమైన ఫైల్ ను గవర్నర్ కు పంపించి ఆర్దినెన్సు కూడా జారీ చేయించారు.

సహాయ మంత్రి పదవి హోదా ఉండే ఈ పదవులలో అసంతృప్త నేతలకు అవకాశం కల్పించటానికి కెసిఆర్ ఆ కొత్త ఏర్పాటు తీసుకువచ్చారు. ఇప్పటికే ఈ పదవులకు శ్రీనివాస్ గౌడ్, జలగం వెంకట్రావ్, కోవా లక్ష్మి మొదలైన వారికి హామీ ఇచ్చి వారికి ప్రకటించారు కూడా. ఈ పార్లమెంట్ సెక్రటరీ లుగా నియమితులైన వారు మొత్తం ఆరుగురు ఉండబోతున్నారు. అంటే వీళ్ళందరూ మంత్రులు కాని మంత్రులుగా ఉండబోతున్నారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana goverment  k chandra shekar rao  parliamentary secretary  ordinence  governer  

Other Articles