Hyderabad moinabad engineering studentsrave party arrested

hyderabad rave party, hyderabad engineering studentsrave party, engeneering stundents rave party busted, hyderabad rave party models, rave party dances, rave party models arrested, western culture in hyderabad, cyberabad police latest updates, moinabad colleges rave party, latest telugu news updates

hyderabad moinabad engineering studentsrave party arrested : cyberabad police busted a rave party in moinabad of rangareddy district arrests 40 members. cyberabad police arrests engineering studentsand girls for participating rave party

రేవ్ పార్టీలో బీటెక్ విద్యార్థుల హాట్ డాన్సులు

Posted: 12/20/2014 10:01 AM IST
Hyderabad moinabad engineering studentsrave party arrested

అశ్లీల నృత్యాల, పాడు సంస్కృతికి హైదరాబాద్ వేదికగా మారుతోంది. నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా విష సంస్కృతి పాకుతోంది. వెస్ర్టన్ కల్చర్, పార్టీల పేరుతో విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు బానిసవుతున్నారు. నగరంలో ఇప్పటికే డ్రగ్స్ ముఠాలు తిష్టవేసి యువత బంగారు భవిష్యత్తును మత్తులో నాశనం చేస్తుండగా.., కొత్తగా రేవ్ పార్టీలు మొదలయ్యాయి. కొద్దికాలంగా చాటుమాటుగా సాగిన ఈ నీచపు వ్యవహారం.., ఈ మద్య పెచ్చుమీరుతోంది. ప్రతీ వారం నగర శివార్లలోని రిసార్టుల్లో ఏదో ఒక చోట రేవ్ పార్టీ జరుగుతోంది. దొరికినవారు దొంగలు.., మిగతావారు రాజులు అన్న చందంగా మారటంతో సీక్రెట్ గా పార్టీలు నిర్వహించుకుంటున్నారు.

తాజాగా హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ లో మరో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఓ ఫాం హౌజ్ లో పార్టీ జరుగుతున్నట్లు గుర్తించిన పోలిసులు..., దాడి చేయగా దిమ్మతిరిగే దృశ్యాలు కన్పించాయి. మద్యం బాటిళ్ళు, హుక్కా తో పాటు యువతీ యువకులు కలిసి అసభ్యంగా డాన్సులు చేయటం చూసి పోలిసులు విస్తు పోయారు. పార్టీలో పాల్గొన్న 40మందిని పోలిసులు అరెస్టు చేశారు. ఘటనా స్థలంలో పెద్దఎత్తున మద్యం, హుక్కాను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థుల మొబైల్స్, నగదును కూడ స్వాధీనం చేసుకున్నారు.

ఈ నెల మొదటి వారంలో కూడా మొయినాబాద్ లో రేవ్ పార్టీని ప్రత్యేక బృందాలు భగ్నం చేసి.., ముంబై మోడల్స్ ను అరెస్టు చేసిన ఘటన మరువక ముందే ఇలా జరగటం పోలిసులకు సవాల్ గా మారింది. వరుసగా అరెస్టు చేసినా.., వారాంతాల్లో పార్టీలు మాత్రం ఆగటం లేదు. వీరిపై కేసులు నమోదు చేసేందుకు ప్రత్యేక చట్టాలు లేకపోవటంతో పాడు కల్చర్ పురివిప్పుతోందని విమర్శలు వస్తున్నాయి. రేవ్ పార్టీలపై పోలిసులు ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు.., ప్రభుత్వం కఠిన శిక్షలకు చట్టాలు తెస్తేనే అదుపులోకి వస్తాయని మేధావి వర్గం చెప్తోంది.
 

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad rave party  cyberabad police updates  engineering student  

Other Articles