You can celebrate the new year eve with hot sunny leone

Sunny Leone on new year, Sunny Leone in Hyderabad, sunny in Hyderabad on new Year, sunny leone new year celebrations, sunny dance on new year eve, new year celebrations with sunny leone, sunny lone in jubliee hillson decenber 31st

Sunny Leone will be performing at a convention hall in Jubilee Hills this New Year’s Eve. Confirming the news, Sainath Goud from PX and RnH event management company says, “Sunny will reach Hyderabad on December 31. She will dance to songs from her own films.

భలే రంజు: సన్నీ లియోన్ తో న్యూ ఇయర్ వేడుకలు

Posted: 12/19/2014 06:22 PM IST
You can celebrate the new year eve with hot sunny leone

యంగ్ జనరేషన్ మోస్ట్ సర్చడ్ హాట్ బ్యూటీ హైదరాబాద్ కు వస్తున్నారు. ఇది నిజంగా సూపర్ న్యూస్.. అందాల బొమ్మ, అపరంజి కొమ్మ, కులుకులొలికే ముద్దుగుమ్మ ఒకనాటి ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ హైదరాబాద్‌ కుర్రకారును ఉర్రూతలింగించేందుకు సిద్దమవుతున్నారు. అది కూడా ఏ సాదాసీదా కార్యక్రమానికో కాదు... న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని మస్త్ మజా చేయడానికి.. తన ఒంపుసోంపులతో ఆడి పాడటానికి.. యువత గుండెలను లాగేయడానికి. ఇప్పటికే సర్చింగ్ లో ఈ ముద్దుగుమ్మ ఏకంగా మన దేశ ప్రధాని నరేంద్రమోడీని వెనక్కు తోసి ముందుకు దూసుకెళ్లిన సెక్సీ బ్యూటీ.. హైదరాబాద్ కుర్రకారును రంజింపజేయడానికి ఈ నూతన సంవత్సర వేడుకలకు రానుంది..

ఈసారి హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి బోలెడంతమంది సెలబ్రిటీలు హైదరాబాద్ రాబోతున్నారు. ఎవరొస్తే, ఎవరు రాకపోతే ఏంటి.. సన్నీ లియోన్ వస్తోంది.. హైదరాబాద్ కుర్రకారుకి ఇది చాలు. ఈ బాలీవుడ్ హాట్ భామ జూబిలీహిల్స్‌ శివారులోని జెఆర్సి కన్వెన్షన్ సెంటర్ లో జరిగే నూతన సంవత్సర వేడుకలలో పాల్గొంటారు. ఉత్సాహభరితమైన వాతావరణంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది. సన్నీ లియోన్‌ని తమ సిటీకి తీసుకెళ్ళాలని దేశవ్యాప్తంగా వున్న అనేక ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు ప్రయత్నించాయట. కానీ ఆ అవకాశం ఒక్క సంస్థకి మాత్రమే దక్కింది. అది కూడా మన హైదరాబాద్ సంస్థకే దక్కింది.. హైదరాబాద్ డెవలప్ అవుతోందని తెలుసుగానీ.. ఇంత డెవలప్ అవుతుందని ఎవరూ ఊహించి వుండరు..

అయితే ఈ ఒక్క రోజు ఈవెంట్ లో పాల్గొనేందుకు సన్ని లీయోన్ ఏకంగా ఐదు కోట్ల రూపాయల మేర పారితోషకం తీసుకుంటుందని, అందులో ఇప్పటికే సగం మేర అడ్వాస్ పేమెంట్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. కేవలం ఒక్క రాత్రి తన ఆట పాటలతో యువతను ఊర్రూతలూగించినందుకు ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి ఒక్క సెలబ్రీటీకే పెడుతున్నారంటే.. ఇక మరెందరు సెలబ్రిటీల ఇక్కడి వస్తున్నారో.. ఎవరెవరెకి ఎంతెంత ఖర్చు పెడుతున్నారో లెక్కలు తేలాల్సివుంది. ఇదిలావుంటే ఈ ఈవెంట్ కు హాజరవుతున్న కుర్రకారుకు ఎంతెంత మేర టిక్కెట్ ధరను పెడతారో కూడా వేచి చూడాల్సిందే.

అయితే ప్రభుత్వం నుంచి పోలీసుల నుంచి అనుమతి పొందారా..? లేదా అన్నది కూడా తెలియాల్సి వుంది. అటు మధ్యపానం, క్లబ్ డాన్సులు, జూదాలపై కోరాడా ఝళిపిస్తున్న ప్రభుత్వం.. సన్ని లియోన్ నృత్యకేళీకి అనుమతి ఎలా ఇస్తుందన్న ప్రశ్నలకు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు ఈ కార్యక్రమం ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతుందా? లేక సంప్రదాయవాదులు ఏమైనా అడ్డు తగలుతారా అన్నది వేచిచూడాలి. ఏదీ ఏమైనా ఒక్క రోజు బాగోతానికి మీసాలు తీసేసినట్టు.. ఒక్క రోజు సంబరాల కోసం కోట్ల రూపాయలను వెదజల్లడం కూడా జూదం లాంటిదేనన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunny leone  New year celebration  Hyderabad  Bollywood  

Other Articles