This tiny gujarat village has over rs 1000 cr in nri deposits

Gujarat village Dharmaj, dhanmaj has Rs 1000 cr deposits, dhanmaj has Rs 1000 cr NRI deposits, Dharmaj total literate village, Dharmaj sets record, Dharmaj NRI's abroad, Dharmaj has 3120 NRI's

Rich flow of funds has made Dharmaj one of the richest and most literate villages not only in the state but across the country

కుగ్రామం కాదది.. అత్యంత ధనిక గ్రామం..

Posted: 12/19/2014 12:53 PM IST
This tiny gujarat village has over rs 1000 cr in nri deposits

గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో ఉన్న ధర్మాజ్ అనే మారుమూల గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక ధనిక గ్రామంగా ఈ గ్రామాం చరిత్ర సృష్టిస్తోంది. అంతేకాదు నూరు శాతం అక్షరాస్యతతో గ్రామం మరో రికార్డును కూడా సాధించింది. దేశంలో 90 వేల కోట్ల రూపాయల ప్రవాస భారతీయుల డిపాజిట్లతో కేరళ రాష్ట్రం ముందంజలో వుండగా, గుజరాత్ లో ఒక్క చిన్న గ్రామమే వెయ్యి కోట్ల డిపాజిట్లను సాధించడం మరో విశేషం. వడోదరకు 70 కిలోమీటర్ల దూరంలో.. ఆనంద్ జిల్లాలో వున్న ఈ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు చేసిన బ్యాంకింగ్ డిపాజిట్లతో అది అత్యంత ధనిక గ్రామంగా అవతరించింది.

కేవలం 11 వేల 333 మంది జనాభా వున్న ఈ గ్రామంలో 13 బ్యాంకులు వాటి శాఖలను ప్రారంభించి సేవలను అందిస్తున్నాయంటే.. ఆ గ్రామానికి వున్న విశిష్టత ఇట్టే అర్థమవుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా ఫోస్టాపీసు, బ్యాంకులలో ఈ గ్రామం నుంచి వెళ్లిన ప్రవాస భారతీయులు ఇక్కడ చేసిన డిపాజిట్ల మొత్తం 1000 కోట్లకు చేరుకుందని వడోదర డివిజన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆర్.ఎన్. హిర్వే మీడియాకు వెల్లడించారు. ధర్మాజ్‌లో 3 వేల కుటుంబాలు ఉండగా ఆయా కుటుంబాల నుంచి కొందరు అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో స్థిరపడ్డారు. వారు తమ డిపాజిట్లను స్వగ్రామంలో బ్యాంకుల్లో చేయడంతో ధర్మాజ్ ఆర్థికంగా అందరినీ ఆకట్టుకునేలా మారింది. దీంతో గ్రామంలో నిరక్షరాస్యత అనేది మచ్చకు కూడా కనబడకుండా చేస్తోంది. గ్రామంలో 3000 కుటుంబాలు నివాసం వుండగా, వాటిలో సుమారు 1700 కుటుంబాలకు చెందిన సభ్యులు బ్రిటెన్ లో స్థిరపడగా, 300 మంది అమెరికాలో 150 మంది న్యూజీలాండ్ లో, 200 మంది కెనడాలో, 60 మంది అస్ట్రేలియాలో స్థిపడ్డారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NRI  Vadodara  Dharmaj  Central Bank of India  

Other Articles