Telangana cabinet to meet over key issues

telangana cabinet to meet over key issues, cabinet meet on key issues, appointment of parliament secretaries, cabinet to discuss on illegal lands regularization, Hyderabad, rangareddy lands regularization

telangana cabinet to meet over key issues mainly to resolve the appointment of parliament secretaries

కీలకాంశాలపై భేటీ కానున్న తెలంగాణ క్యాబినెట్

Posted: 12/18/2014 11:45 PM IST
Telangana cabinet to meet over key issues

తెలంగాణ మంత్రివర్గం మరోసారి రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై భేటీ కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉదయం 11.30 గంటలకు సమావేశం సచివాలయంలో మంత్రివర్గం భేటీ కానుంది. ప్రధానంగా పార్లమెంటు కార్యదర్శకుల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. పార్లమెంటు సెక్రటరీల నియామకంలో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. దీనిపై ఓ కేసు ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగులో ఉంది. ఈ తరుణంలో వీరిని క్యాబినెట్ లో చేర్చుకోవాలా..? లేక అలాగే కోనసాగించాలా అన్నవిషయాన్ని కూడా చర్చించనున్నారు.

నలుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటు సెక్రటరీలుగా నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. శ్రీనివాసగౌడ్, జలగం వెంకటరావు, వినయ్ భాస్కర్, కోవ లక్ష్మిల పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. అయితే, న్యాయపరమైన చిక్కులు ఉండటంతో దీనిపై తీసుకోవాల్సిన చర్యల మీద శుక్రవారం నాడు కేబినెట్లో చర్చించనున్నారు. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూ ఆక్రమణల క్రమబద్ధీకరణ మీద కూడా తెలంగాణ కేబినెట్ చర్చించనుంది. అంతకు ముందు క్యాబినెట్ సభ్యులు చీఫ్ విప్గా నియమితులైన కొప్పుల ఈశ్వర్.. బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి హజరవుతారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  cabinet meeting  cm kcr  chief whip  

Other Articles