Sarah begum a british born bengali girl realised the ambition of a lifetime when she went to amazon forest

amazon souls, sarah begum, british girl, amazon forest trip, amazon forest documentary film

At the age of 21, Sarah Begum, a British born Bengali girl realised the ambition of a lifetime when she went to live with the Huaorani tribe deep in the Amazon Rainforest and immersed herself in their way of life.

ITEMVIDEOS: అరణ్యంలో ఆమె అలా అనుకోకుండా మనువాడింది.....!

Posted: 12/17/2014 11:51 AM IST
Sarah begum a british born bengali girl realised the ambition of a lifetime when she went to amazon forest

బ్రిటిష్ ఫిలిం మేకర్ శారా బేగంకు చిన్నప్పటినుండే ఒక కోరిక ఉండేదంట..!! అమెజాన్ అడవుల్లో ఉండే ఆది వాసులను చూడాలని. ఆ కోరికను మనసులోనే ఉంచుకొని పెద్దయ్యాక దాన్ని బయటకు తీసి అమలు చేసేసింది. ఇంకేం అమెజాన్ అడవులకు వెళ్లటానికి సిద్దమైపోయింది. కొందరు ఈ లండన్ పిల్ల కు ఈ 'జంగ్లీ కోరికెంటో' హవ్వా అని ముక్కున వేలేసుకున్నారు. కాని అవేమి పట్టించుకోకుండా తను 21 వ సంవత్సరాలు వయసుండగా అన్ని భాద్యతలను వదులుకొని, ఉద్యోగానికి రాజీనామా చేసి, హ్యురోని తెగ ప్రజల జీవన శైలి గురించి అధ్యయనం చేయటానికి ఈక్వెడర్ అడవుల లోకి వెళ్ళింది శార..  ఆ అడవిలో హ్యురోని తెగ కు చెందిన వాళ్ళు మూడు వేల వరకు ఉంటారు. వారు శారా కు అపూర్వ స్వాగతం పలికారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తులతో కలిసిపోయింది. వాళ్ళలో భాగమైపోయింది. అల్లికల నుండి వేట వరకు అన్ని విభాగాల్లో తర్ఫీదు ను పొందింది.

ఒక రోజు ఆ అడవిలో అర్దంతరంగా ఉన్నతుంది శార ని పిలిచి తెగ పెద్దలు ఒక గుడిదే లోకి తీసుకెళ్ళి వివస్త్ర గా మార్చి తమ సంప్రదాయ దుస్తులను ధరింప జేసి, తమ సంపదాయానికి సంబంధించిన మంత్రాలను చదవటం, పూజలను చేయటం ప్రారంభించారు.  ఎం జరుగుతుందో అసలు శార కు అర్ధం కాలేదు. అపుడు వాళ్ళు  ‘నువ్వు మాకు రాణిలాంటిదానివి.  మా తెగ యోధుడు జింక్టోతో నీకు వివాహం జరిపిస్తున్నాం. లైంగిక అవసరాల కోసం నిన్ను వాడుకోవడానికి ఇలా చేయడం లేదు. మా తెగ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నవారిని, ఇష్టమైన అమ్మాయిలను ఇలా గౌరవిస్తాం’’ అన్నారు ఆ అడవిలోని తెగ పెద్దలు. దాంతో శార వారి అమాయకత్వానికి  ఆశ్చర్యపడిందో, ముచ్చటపడిందో, తనకు తాను రాజీ పడిందో తెలియదుగానీ... జింక్టోతో జరిగిన తన పెళ్లి తంతును ఆమె ప్రతిఘటించలేదు. వద్దని కూడా అనలేదు.  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జింక్టో కూడా తనకు బాగా నచ్చాడు.  ‘‘జింక్టో బలశాలి,  నేర్పరి అయిన వేటగాడు మాత్రమే కాదు... మంచి హృదయం ఉన్నవాడు’’ అని జింక్టో గురింఛి చెప్పుకొచ్చింది. రెండు వారాలు తరువాత తిరిగి లండన్‌కు చేరుకుంది శారా. ఈ రెండు వారాల్లోనే హురోని తెగల ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకుంది. వారి మనసులో చోటు సంపాదించుకుంది.

ఈ 'జంగ్లి కోరికను' జంగల్ లో గడిపి తీర్చుకున్నాక తన అరణ్య అనుభవాలను "అమెజాన్ సోల్స్" పేరుతో ఒక లఘు చిత్రాన్ని నిర్మించింది. ఇది కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రశంశలు అందుకోవటం గమనార్హం. ఆమె సాహసాన్ని చూసి అందరూ అబ్బుర పడ్డారు. ఇప్పటికే ఆ తెగ ప్రజల గురించి తన బ్లాగ్ లో రాస్తూనే ఉండటం విచిత్రం.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sarah begum  amazon souls  british girl  amazon forest trip  

Other Articles