Kejriwal costly dinner for funds collection with 20 thousand per person

kejriwal lunch cost, arvind kejriwal costly lunch amount, kejriwal costly 20000 rupees lunch, kejriwal lunch money collection, delhi elections, aam admi party in delhi elections, congress on delhi elections, bjp on delhi elections, latest news updates

kejriwal costly dinner for funds collection : aam admi party convenor arvind kejriwal started collecting money for election needs, arvind kejriwal conducted a lunch programme for collecting money for election expenses with each plate costs rupees 20 thousand

ప్లేటు భోజనం కేవలం రూ. 20వేలే

Posted: 11/28/2014 04:54 PM IST
Kejriwal costly dinner for funds collection with 20 thousand per person

పేదల పార్టీగా చెప్పుకునే అరవింద్ కేజ్రివాల్ భారీ ఖర్చుతో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్లేటు భోజనం ఖరీదు కేవలం రూ. 20వేలేనట. అవాక్కయ్యారా.., సెవెన్ స్టార్ హోటల్ లో ఒక రోజంతా ఉండి భోజనం చేసినా ఇంత ఖర్చు అవ్వదు కదా అనుకుంటున్నారా? ఇది నిజమే. ఎన్నికల ఖర్చుల కోసం అయ్యే నిధుల సమీకరణలో భాగంగా పార్టీ విందు నిర్వహించింది. ముంబైలో జరిగిన ఈ విందుకు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఇతర విభాగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించింది.

నేరుగా డబ్బులు తీసుకోలేక ఇలా విందు భోజనం పెట్టిన పార్టీ.., ఒక్కో ప్లేటు ధర రూ. 20వేలుగా నిర్ణయించింది. ప్లేటు మీల్స్ ధర కాస్త ఎక్కువే అయినా పార్టీ ఫండ్ కావటంతో.., తప్పదన్నట్లుగా చెల్లించి భోంచేశారు. ఇలా విందు పేరిట మొత్తం రూ.91లక్షలు వసూలు చేసినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ఈ మొత్తంలో 36లక్షల రూపాయలు నగదు కాగా.., రూ. 36 లక్షల రూపాయలు చెక్కులు ఉన్నాయి. మిగతా నగదు వాలంటీర్ల ద్వారా వసూలయినట్లు తెలుస్తోంది. ప్లేటుకు రూ.20వేలు బాగా గిట్టుబాటు కావటంతో మిగతా ప్రాంతాల్లో కూడా భోజనాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు.

త్వరలో బెంగళూరులో విందు కార్యక్రమం ఏర్పాటు చేస్తారట. ఆర్థిక రాజధాని లో రూ. 20వేలు ధర నిర్ణయించారు. తర్వాతి టార్గెట్ ఐటీ హబ్ కావటంతో వారిని టార్గెట్ చేసి ఎంత ధర నిర్ణయిస్తారో తెలియాల్సి ఉంది. గతంలో జరిగిన ఎన్నికలకు కూడా విరాళాలు సేకరించారు. టార్గెట్ రీచ్ కాగానే ఇక ఎవరూ డబ్బులు పంపవద్దు అని ప్రకటించారు కూడా. అయితే భోజనాలు పెట్టి వేల రూపాయలు వసూలు చేయటంపై ప్రత్యర్ధి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kejriwal  lunch  aam admi party  fund collection  latest news  

Other Articles