Woman accused of blackmailing xenia hospital owner in hyderabad

sexual harassment, Humiliation, blackmailing, Xenia Hospital, ECIL, woman, police, money

woman accused of blackmailing xenia hospital owner in hyderabad

నగ్నంగా ఫోటో తీసినందుకు రూ. 50 లక్షల పరిహారం..

Posted: 11/27/2014 09:53 PM IST
Woman accused of blackmailing xenia hospital owner in hyderabad

దేశంలో మహిళలపై ఆకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు అధికమవుతున్నాయి. దేశంలో అనేక మంది మదమృగాళ్లు మహిళా సమాజాం స్వేచ్ఛను హరిస్తున్నారు. దీన్నే అసరాగా తీసుకుని మరికొందరు మాయలాడీలు పురుషులను బ్లాక్ మెయిల్ కు గురిచేస్తున్నారు. సాధ్యమైనంత వరకు డబ్బును గుంజుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని ఈసీఐఎల్ లో జరిగింది. తనను నగ్నంగా ఫోటో తీశారంటూ ఓ యువతి ఆరోపించింది. అంతేకాదు నగ్నంగా ఫోటో తీసినందుకు గాను తనకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. దీంతో కంగారు పడిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
ఈసీఐఎల్లోని జినియా ఆసుపత్రి యజమాని తనను నగ్నంగా ఫోటో తీశారని ఓ యువతి అరోపించింది. తన నగ్నదేహాన్ని చిత్రీకరించినందుకు గాను పరిహారంగా 50 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఓ యువతి డిమాండ్ చేసింది. దీంతో కంగారు పడిన జినియా అస్పత్రి యజమాని పోలీసులను ఆశ్రయించాడు. తనను ఓ యువతి బ్లాక్ మెయిల్ చేస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sexual harassment  Humiliation  blackmailing  Xenia Hospital  ECIL  woman  police  money  

Other Articles