Telangana people are suffering a lot government has no concern alleges maoist leader ganapathi

Telangana government, chief minister, KCR, Telangana, maoist leader, maoist party, people, ganapathi

telangana people are suffering a lot, government has no concern alleges maoist leader ganapathi

తెలంగాణలో నియంత పాలన.. ప్రజలపై ఉక్కుపాదం

Posted: 11/27/2014 11:59 PM IST
Telangana people are suffering a lot government has no concern alleges maoist leader ganapathi

తెలంగాణ ప్రభుత్వంపై మావోయిస్టు కేంద్ర కమిటి మండిపడింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై మావోయిస్టు జనరల్‌ సెక్రటరీ గణపతి పేరుతో మూడు పేజీల లేఖను గురువారం విడుదల చేసింది. తెలంగాణలో నియంత పాలన సాగుతోందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మీడియాపై ఉక్కుపాదం మోపిందని, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ 9 ప్రసారాలను తెలంగాణ ప్రభుత్వం పరోక్షంగా నిలిపివేసిందని ఆ లేఖలో పేర్కొన్నారు. టీవీ 9 ప్రసారాలను పునరుద్దరించిన ప్రభుత్వం.. ఏబీఎన్‌ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తప్పులను చూపిస్తూ... ఎదురుతిరిగిన వారిపై ఉక్కుపాదం మోపుతోందని గణపతి ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకే తెలంగాణ సర్కార్‌ పోలీస్‌ వ్యవస్థను ఆధునీకరణ చేస్తోందని విమర్శించారు. ప్రాణహానీ ఉందని టీఆర్‌ఎస్‌ మంత్రులకు ప్రభుత్వం బుల్లెట్‌ ఫ్రూప్‌ వాహనాలను ఇచ్చిందని, కేసీఆర్‌ ప్రభుత్వం బహుళజాతి సంస్థలకు రెడ్‌ కార్పెట్‌ వేస్తోందని, తెలంగాణ వనరులు దోచుకుంటున్న వారిపై తిరగబడాలని, అడ్డగోలు వ్యాపారాలు చేస్తున్న సీమాంఽద్రులపై చర్యలు తీసుకోవాలని గణపతి లేఖలో వెల్లడించారు.

గిరిజన ప్రాంతాల్లో పోలీసుల దాడులు కొనసాగున్నాయని, బంద్‌కు పిలుపు ఇస్తే వ్యాపారులను బెదిరించి షాపులు తెరిపించారని గణపతి మండిపడ్డారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తగిన గుణపాఠం చెబుతామని ఆ లేఖలో హెచ్చరించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana government  chief minister  KCR  Telangana  maoist leader  maoist party  people  ganapathi  

Other Articles