Telangana government announces new industrial policy opposition parties support

Telangana industrial policy, KCR, Telangana Assembly, Opposition support, Akbaruddin, Land allotments

telangana government announces new industrial policy, opposition parties support

కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన షీఎం.. విపక్షాల మద్దతు..

Posted: 11/27/2014 11:00 PM IST
Telangana government announces new industrial policy opposition parties support

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు శాసనసభలో  నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దేశంలో అగ్రగామిలా ఉండేలా పారిశ్రామిక విధానం అమలు చేస్తామన్నారు. రాష్ట్ర శాసనసభలో కొత్త పారిశ్రామిక విధానం బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... గ్రానైట్ ఉత్పత్తుల రవాణాలో నిబంధనలు సరళీకరిస్తామన్నారు. బిల్లును సభ్యులంతా ప్రోత్సహించడం ఆనందంగా ఉందన్నారు. కొత్తఫార్మా కెమికల్‌ సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సింగిల్‌ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తామన్నారు.

అలాగే  హైదరాబాద్‌ - వరంగల్‌ కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తెలంగాణ జౌళి నిలయంగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. పారిశ్రామిక పార్కులు, వ్యాట్‌ హేతుబద్ధీకరణ, పారిశ్రామిక కార్మికుల రక్షణ మొదలైన అంశాలపై శ్రద్ధ పెడతామని చెప్పారు. విద్యుత్‌, నీటి సదుపాయాలను కూడా మెరుగు పరుస్తామని  సభలో కేసీఆర్ చెప్పారు. కాగా భూ కేటాయింపుల ఆంశంపై తెలంగాణ శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. సొసైటీల ముసుగులో కొందరు పెద్దలు గద్దల్లా భూములను కబ్జా చేయటమే కాకుండా, దర్జాగా అమ్ముకున్నారని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ ఘాటుగా విమర్శించారు. ఎన్ని విచారణ కమిటీలే వేసినా  ఫలితం  కానరాలేదన్నారు. సొసైటీలన్నింటిని రద్దుచేసి ప్రభుత్వం ఓ స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించాలని అక్బరుద్దీన్‌ సూచించారు. దీనిపై స్పందించిన కేసీఆర్ సొసైటీ భూముల్లో అక్రమాలపై ఒకటి కాదు రెండు సభా సంఘాలు ఏర్పాటు చేయాలని స్పీకర్‌ను కోరారు. సభాసంఘం ఏర్పాటుపై ప్రతిపక్షాలు మద్దతు పలికాయి

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles