Maid thrashes kid throws her on floor in uganda

uganda maid, maid thrashes kid, kid thrown on floor, cc camera, vomiting, police action, Toddler, mercilessly, torture, Jolly Tumuhiirwe, Rukungiri District., Erick Kamanzi, NGO, Kampala

maid thrashes kid throws her on floor in uganda

చిన్నారిని చిత్రహింసలు పెట్టిన కసా(యా)యి

Posted: 11/25/2014 09:22 PM IST
Maid thrashes kid throws her on floor in uganda

సంపన్న కుటుంబాల్లో ఆయా అంటే పెంచిన తల్లితో సమానం. ఒక రకంగా చెప్పాలంటు చన్నిపిల్లలు తల్లి కన్నా ఎక్కువగా ఆయాలతోనే చనువుగా, గారాబంగా పెరుగుతారు. అయితే మధ్య తరగతి కుటుంబాల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లేటప్పుడు ఇంట్లో చంటి పిల్లలను చూసుకోడానికి ఆయాలను పెట్టుకోవడం సహజం. కొందరు క్రెచ్ లలో వారి పిల్లలను వదిలితే.. అలా వద్దనుకున్న వారు మాత్రం తమ ఇంట్లోనే ఓ ఆయాను ఏర్పాటు చేసుకుంటారు. తమ పసికూనతో నిత్యం వుంటుంది కనుక. ఒక్కదాన్ని చూసుకోవడం అంత కష్టంగా వుండదని భావిస్తుంటారు.

తమ పిల్లల ఆలనాపాలన చూసి సమాయానికి బోజనం పెట్టాలని ముందుగా షరతులు విధించి ఆ తరువాతే పనులకు కుదుర్చుకుంటారు. అయితే, వాళ్లు ఎలాంటి వాళ్లో ముందే తెలుసుకోవడం మాత్రం కష్టం. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఉగాండాలో జరిగింది. ఎరిక్ కమాన్జి దంపతులు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తుంటారు. అయితే జాలీ తుముహిర్వే అనే 22 ఏళ్ల అయాను తమ చిన్న పిల్ల కోసం నియమించుకున్నారు. ఎంతో గారాబంగా చూసుకోవాల్సిన రెండేళ్ల పసిపాపను వాంతి చేసుకుందని ఏకంగా సోఫాలోంచి కిందకు విసిరేసింది అ కసాయి ఆయా, టార్చిలైటుతో కొట్టింది. తర్వాత కాలుపెట్టి తొక్కేసింది, అంతేకాదు పాపను కాలితో అంతదూరం తన్నేసింది. ఇంకా కోపం తగ్గకపోవడంతో మళ్లీ అటూ ఇటూ తొక్కుకుంటూ వెళ్లింది.

జాలీ తుముహిర్వే  పనిలో  చేరినప్పటి నుంచి తమ పాపలో కొంత హుషారు తగ్గింది. నిద్రలో కూడా ఉల్లిక్కి పడుతూ వుంది. ఏ జరిగిందో తెలుసుకోవాలనుకున్న పాప తల్లిదండ్రులు ఆయాను పనిపై బయటకు పంపి ఇంట్లో సిసిటీవీ కెమెరాలను బిగించారు. అయితే ఆయా చేతిలో చిత్రహింసలు అనుభవించిన రోజున పాపకు జర్వం వచ్చింది. దీంతో సీసీటీవీ ఫూటేజ్ ను చూస్తు భయంకర విషయాలు భయటపడ్డా.యి. పాప బాగోగులు చూస్తుందనుకుంటే పాపను పెట్టే అన్నం తినడమే కాకుండా.. డబ్బులిచ్చి మరీ పాపను కొట్టించామని వాపోయారు ఆ దంపతులు.

 సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఫూటేజ్ ఆధారంగా పాప తల్లిదండ్రులు జాలీ తుముహిర్వే పై హత్యాయత్నం కేసు పెట్టారు. పిల్లలను ఎవరైనా ఇలా చేయడం చూస్తే తల్లిదండ్రులు ఇలాంటి ఆయాలను చంపేయాలని అనుకుంటారని ఉగాండా కార్మిక, సామాజిక అభివృద్ధి శాఖ మంత్రి మేరీ కరూరో ఓకురుట్ అన్నారు. అయితే ఈ తల్లిదండ్రులు మాత్రం అలా చేయకుండా చట్టాన్ని ఆశ్రయించారని చెప్పారు. డిసెంబర్ 8న సదరు ఆయాను కోర్టులో ప్రవేశపెడతారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles