Murderous nurse took smiling photos with dead patients she s accused of killing

38 Murders, nurse, smiling photos, dead patients, accused, killing, accused of killing

Murderous nurse took smiling photos with dead patients she's accused of killing

నరహంతకురాలు..శవాలతో ఫోటోలు దిగిన కిలాడీ నర్సు..

Posted: 11/25/2014 05:00 PM IST
Murderous nurse took smiling photos with dead patients she s accused of killing

జివ్హకో రుచి, పుర్రెకో బుద్ది, అన్నట్లు ఆ నర్సుకు వున్న విచిత్రమైన అలవాడు తెలుసా..? ఫోటోలు దిగడం. ఇదేంటి అందరూ సెల్పీల తీసుకోగా లేనిది.. అమె ఫోటోలకు ఫోజులిస్తే.. విచిత్రమైన అలవాటంటారు అనుకుంటున్నారా..? అమె ఫోటోలు దిగేది ఏ పుణ్యక్షేత్రానికో, లేక ఏ ఈవెంట్ లోనే కాదు.. ఏకంగా చనిపోయిన వారి శవాల పక్కన పడుకుని ఫోటోలకు ఫోజులిచ్చేది. అదీనూ నవ్వుతూ. అది కూడా తానేదో ఘనకార్యం సాధించిన దానిలా థమ్స్ అప్ ఫోజులిస్తూ..పోటోలు దిగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 38 మంది మృతులతో ఫోటోలు దిగింది.

అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ వుంది. అ 38 మందిని నర్సు చంపేసి మరీ ఫోటోలు దిగిందట. 38 మందిని చంపి వారి శవాలతో ఫోటలోలు దిగిందంటే.. ఈమె ఖచ్చితంగా నరహంతకురాలే. 38 మందిని చంపిన ఇటలియాన్ నర్సు డానియేల్ పోగ్యాలీ గురించి ఆలస్యంగా నిజాలు వెలుగు చూడటంతో అందరూ ఖంగుతిన్నారటజ ఫోటోలకు ఫోజుల్చినే ఈమెను ఫోటోలు తీసిన మరో సహనర్సు సారా పౌసిని పోలీసులు విచారించగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. తనను భయబ్రాంతికి గురిచేసి డానియేల్ పోగ్యాలీ ఫోటోలు తీయించుకునేదని విచారణలో సారా పౌసిని తెలిపింది.

అంతే కాదు 38 మంది అమె చంపాడానికి కారణం కూడా చాలా సిల్లీగా వుంది. రోగులు కానీ, వారి తరపున బందువులు గానీ అమెపై అరిచినా.. కొపంగించుకున్నా.. వారి రోగులపై డానియేల్ పోగ్యాలీ మరణశాసనాన్ని లిఖించేదట. చనిపోయిన వారి పక్కన సంతోషంగా నిలబడి ఫోటోలకు దిగేదని సారా చెప్పింది. మృతులకు దెగ్గరగా వెళ్లి మరీ ఫోటోలు తీయమని బెదిరించేదని తనను, తన స్వభావాన్ని చూసి తాను అనేక పర్యాయాలు భయాందోళనకు గురయ్యానని చెప్పింది. అంతేకాదు తన సహచర నర్సులను ఇబ్బందులను పెట్టేందుకు డ్యూటీ ముగించుకుని వెళ్లే సమయంలో వారి విరోచనాలు కలిగే ఇంజక్షన్ చేసేదని, 48 గంటల తరువాత వాటిని కనుగోనడం కూడా కష్టమని సారా తెలిపింది. ఇప్పటి వరకు కేవలం 78 ఏళ్ల వృద్దుడిని చంపిన కేసులో మాత్రమే ఆధారాలు లభ్యంకావడంతో అమెపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పడు తాజాగా 38 మందిని చంపిందని కేనును మర్చారు. ఈ దర్యాప్తుకు అమె శవాలతో దిగిన ఫోటోలను సోలీసులు స్వాథీనం చేసుకున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 38 Murders  nurse  smiling photos  dead patients  accused  killing  accused of killing  

Other Articles