Opposition targets centre on black money tmc mps with black umbrellas protest outside parliament

winter session, parliament, black money, narendra modi, Opposition parties, protest, black umbrellas, TMC MPs, outside

Opposition targets Centre on black money, TMC MPs with black umbrellas protest outside Parliament

నల్లధనం అంశంపై దద్దరిల్లిన లోక్ సభ

Posted: 11/25/2014 03:04 PM IST
Opposition targets centre on black money tmc mps with black umbrellas protest outside parliament

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రెండో రోజున నల్లధనం అంశంపై సభ దద్దరిల్లింది. సభ ప్రారంభమైన వెంటనే నల్లధనంపై చర్చకు అనుమతించాలని విపక్షాలు పట్టుబట్టాయి. నల్లధనంపై చర్చకు సమయం కేటాయిస్తామని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించినప్పటికీ సభ్యులు శాంతించలేదు. వెల్‌లోకి దూసుకువచ్చిన సభ్యులు నల్లధనం అంశంపై మొదటగా చర్చించాలని డిమాండ్ చేశాయి. ఈ విధంగా ఆందోళన చేయడం సరికాదని.. తృణమూల్ సభ్యులపై ఒకదశలో స్పీకర్ తీవ్ర అసహనం వ్యక్తం వేశారు.

విపక్ష సభ్యుల ఆందోళన మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగానే తృణమూల్ సభ్యులు మరోమారు వెల్‌లోకి దూసుకొచ్చి నల్లధనాన్నివెనక్కి తెప్పించాలంటూ నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొనింది . దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. సభ వాయిదా పడటంతో తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ బయట నల్ల గోడుగులతో నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నల్లధనాన్ని తీసుకోస్తుందన్న నరేంద్రమోడీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమయ్యిందంటూ తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు.

వాయిదా అనంతరం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే నల్లధనం అంశంపై చర్చించాలని కోరుతూ విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పందిస్తూ... నల్లధనంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. పదేళ్లలో నల్లధనంపై యూపీఏ ఏం చేయలేకపోయిందని, తాము వచ్చిన ఆరు నెలల్లోనే చర్యలు చేపట్టామని వెల్లడించారు. విపక్షాల ఆందోళన మధ్యే లోక్‌సభ కొనసాగుతోంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles