Gorilla throws stones on visitors in berlin zoo

gorilla throws stones, gorilla throws stones on visitors, gorilla attack, gorilla living life cycle, gorilla latest updates, berlin zoo timings, gorilla in zoo, german zoo and updates, wildlife animals, latest news updates

gorilla throws stones on visitors in berlin zoo : in Berlin zoo gorilla surprised the tourists with the attack from frighteningly close range.

ఫొటో దిగటం ఇష్టంలేక రాయితో కొట్టిన గొరిల్లా

Posted: 11/24/2014 04:03 PM IST
Gorilla throws stones on visitors in berlin zoo

మనిషి కోతి రూపం నుంచి పరిణామ క్రమంలో అభివృద్ధి చెందాడని తెలుసిందే. ఈ అభివృద్ధి దశలో కొండముచ్చులు, భారీ సైజులో ఉండే గొరిల్లాలు మానవ పరిణామ క్రమ దశలోని పూర్వ జాతులన్నమాట. ఇవి చూడటానికి మనుషుల్లానే ఉండటంతో పాటు, మనుషుల్లాగే ప్రవర్తిస్తాయి. తాజాగా ఓ గొరిల్లా తనను ఫోటో తీస్తున్నాడని వద్దని చెప్పేందుకు రాళ్ళతో దాడి చేసింది. స్టీఫెన్ నోలెన్ అనే వ్యక్తి బెర్లిన్ లోని జూను చూసేందుకు స్నేహితులతో కలిసి వెళ్ళాడు. జూలోని జంతువులను చూసి వాటిని ఆటపట్టించటంతో పాటు ఎన్ క్లోజర్ల దగ్గరకు వెళ్ళి ఫొటోలు తీసుకున్నారు.

అలా అన్ని జంతువులను చూసుకుంటూ గొరిల్లా ఉండే ఎన్ క్లోజర్ దగ్గరకు వచ్చారు. మిగతా జంతువులను తీసినట్లే గొరిల్లాను ఫొటో తీసేందుకు ప్రయత్నించాడు. మరి కోపం వచ్చిందో.., పర్మిషన్ లేకుండా ఫొటో తీస్తున్నాడనో, లేక ఫోటోలు తీయించుకోవటం ఇష్టం లేదో తెలియదు కానీ.., రాయి తీసుకుని అమాంతం నోలెన్ పై విసిరేసింది. దెబ్బకు నోలెన్ గుండె ఝల్లుమంది... ఆ దెబ్బకు ఫొటో తీయటం ఆపేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నవంబర్ 19న ఈ వీడియో పోస్ట్ చేయగా ఇప్పటివరకు వీడియోను చూసిన వారి సంఖ్య నాలుగు లక్షలకు చేరువ అవుతోంది. అంత పాపులర్ అయిన ఈ వీడియోను మీరూ చూడండి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gorilla  zoo  stones  berlin zoo  latest news  

Other Articles