Men helpfullness increases if women wears high heels

women high heels, high heels new models, high heel shoes for men, men help woman high heels, latest fassion trends, latest fassion dress collection, online shopping apparels, latest news updates

men helpfullness increases if women wears high heels : a survey says that men's helpfulness increased along with the height of the heels a woman was wearing

అబ్బాయిలూ.. హైహీల్స్ వేసే అమ్మాయిలతో జాగ్రత్త

Posted: 11/24/2014 01:16 PM IST
Men helpfullness increases if women wears high heels

కార్యసాధకుడైనా కాంత దాసుడే అన్నట్లుగా.. ఎంతటి మగవాడయినా మగువ ముందు మెడ వంచక తప్పదు. ఇది జగమెరిగిన సత్యం. సినిమాల్లో కూడా ఈ సామెతలపై చాలా డైలాగులు వచ్చాయి. ఆకర్షించే గుణం ఉన్న ఆడవారు.., మగాళ్ళను కంట్రోల్ చేయటంలో కూడా ఆరితేరి ఉంటారు. కండలు తిరిగిన వీరుడిని అయినా తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటారు. అయితే చెప్పులేసుకుని చెప్పుచేతల్లో పెట్టుకోవటం గురించి మీకు తెలుసా ?. ఆడవారు చెప్పులు వేసుకుని మగవారిని కంట్రోల్ చేస్తున్నట్లు తాజాగా ఓ సర్వేలో వెల్లడయింది.

ప్రస్తుత తరం అమ్మాయిలు ఎక్కువగా ఉపయోగిస్తున్న హీల్స్, హై హీల్స్ మగావారిని మగువల వైపు చూపు తిప్పుకునేలా చేస్తాయని నికోలస్ సంస్థ చేపట్టిన సర్వే వెల్లడించింది. ఆడవారికి సాయం చేసే మగవారి గురించి ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా.., మహిళకు ఫ్లాట్ చెప్పులు వేసి ఒక సర్వే ఫాం ఇచ్చి బయటకు పంపింది. ఈ ఫామ్ ను నింపాల్సిందిగా కోరగా.., మగవారు ఎక్కువగా ఆసక్తి చూపలేదట. అయితే అదే మహిళకు హై హీల్స్ వేసి మళ్లీ పంపారు. ఆశ్చర్యకరంగా ఈ సారి ఎక్కువమంది సర్వేలో పాల్గొని ఫామ్ లు నింపేందుకు ఉత్సాహం చూపారట. ఫలితంగా హై హీల్స్ వేసుకుంటే మగవారిలో సాయం చేసే, స్పందించే శాతం ఎక్కువని సర్వే నిరూపిస్తోంది.

హై హీల్స్ కు, మగవారి సాయం చేసే తత్వానికి ఏ సంబంధం లేకపోయినా ఆకర్షణ వల్ల ఇలా జరుగుతుందని నికోలస్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ అంశంపై మరింత లోతుగా పరిశీలన, అధ్యయనం చేయాల్సిన అసవరం ఉందని తెలిపారు. ఇక బార్లలో ఉండే మహిళల్లో హై హీల్స్ వేసుకునే వారితోనే మందుబాబులు కూడా ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడతారట. ఇక హాట్ హాట్ గా కన్పించే మోడల్స్ కూడా హై హీల్స్ వేసుకుంటే మరింత ఆకట్టుకునేవిధంగా ఉంటారని తెలుస్తోంది. అదండీ హై హీల్స్ అట్రాక్టింగ్ పవర్. సో అబ్బాయిలూ... ఎత్తు చెప్పులేసుకునే అమ్మాయిలతో జాగ్రత్త. ఆకర్షణ, ఆవేశంలో ఏమైనా కమిట్ చేయించవచ్చు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : high heels  men  women  helping  latest news  

Other Articles