China rajappa says paritala ravi murder case will re enquired

china rajappa comments, china rajappa on paritala ravi, china rajappa on paritala ravi death enquiry, paritala ravi death case, jc diwakar in paritala ravi death, tdp leaders on paritala ravi death, paritala sunita on paritala ravi death, latest telugu news updates

china rajappa says paritala ravi murder case will re enquired : andhra pradesh chief minister china rajappa says government will discuss on issue of paritala ravi murder case re-enquiry

కేసులతో గోతులు తవ్వుకుంటున్న టీడీపీ

Posted: 11/24/2014 11:28 AM IST
China rajappa says paritala ravi murder case will re enquired

టీడీపీ దివంగత నేత పరిటాల రవి హత్య కేసుపై పునర్విచారణ జరిగే అవకాశం ఉంది. రాష్ర్టంలో సంచలనం రేపిన ఈ హత్య కేసును తిరిగి విచారించే అంశాన్ని పరిశీలిస్తున్నాము అని ఏపీ హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురంలో సోమవారం పర్యటించిన రాజప్ప, పరిటాల ఘాట్ లో నివాళులు అర్పించారు. కేబినెట్ లో చర్చించి ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసకుంటామన్నారు. కేవలం రవి ఎదుగుదలను చూసి ఓర్వలేని శక్తులు హత్య చేయించాయని ఆరోపించారు.

ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మొద్దుశ్రీను జైలు జీవితం అనుభవిస్తూ ఓ ఖైదీ దాడిలో మృతి చెందారు. ఇక శ్రీను వెనక ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కున్న మద్దెల చెరువు సూరి భాను ప్రకాష్ చేతిలో హత్యకు గురయ్యాడు. మిగతావారి విషయానికి వస్తే.., హత్యపై ఆరోపణలు ఎదుర్కుంటున్న కొందరు నేతలు ప్రస్తుతం అధికార పార్టీలోనే ప్రజా ప్రతినిదులుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే  మళ్ళీ విచారణ జరిగితే వారి పేర్లు బయటకు వచ్చి టీడీపీ తన గోతిని తానే తవ్వకుంటున్నట్లు అవుతుంది.

పునర్విచారణ జరిగినా.., ఆరోపణలు వచ్చిన వారికి క్లీన్ చిట్ ఇస్తే మాత్రం రవి వర్గం నుంచి టీడీపీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోనుంది. ఈ కేసు పునర్విచారణ అనేది ప్రారంభం అయితే టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారవుతుంది. మరి విచారణ పేరుతో తుట్టెను కదిపిన చినరాజప్ప ఎంతవరకు మాటపై నిలబడతాడు.. ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది అనేది చూడాలి. అనంతపురంతో పాటు ఉమ్మడి రాష్ర్టంలో టీడీపీ ముఖ్య నేతగా ప్రజల్లో మంచి పట్టున్న పరిటాల రవి దుండగుల చేతిలో 2005 జనవరి 24న జిల్లా టీడీపీ కార్యాలయం సమీపంలోనే దారుణ హత్యకు గురయ్యాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china rajappa  paritala ravi  death  latet news  

Other Articles