Fighting between palvai govardhan reddy k rajgopal reddy

Palvai Govardhan reddy, congress party MP, Rajya sabha, K. Rajgopal reddy, Ex .MP, congress party membership program

fighting between palvai govardhan reddy k rajgopal reddy

ఇది ఆ పార్టీ వారికి కల్పించిన హక్కు అంటున్నారు

Posted: 11/23/2014 06:12 PM IST
Fighting between palvai govardhan reddy k rajgopal reddy

ప్రజాస్వామ్యం అధికంగా వున్న కాంగ్రెస్ పార్టీలో నాయకులు మధ్య పోరుకు పెట్టింది పేరు. ఇది కాంగ్రెస్ పార్టీ వారికి కల్పించిన హక్కు కూడా అని గర్వంగా చెప్పుకుంటారు ఆ పార్టీ నేతలు. తాజాగా ఆ పార్టీలోని రాజ్యసభ ఎంపీ, మాజీ ఎంపీల మధ్య  తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అందుకు సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్షా కార్యక్రమం వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని 10 జిల్లాల నుంచి పార్టీ నాయకులు హాజరయ్యారు.

నాయకులకు సభ్యత్వ నమోదు పుస్తకాలు అందజేస్తున్న క్రమంలో పాల్వాయి గోవర్థన్ రెడ్డికి పుస్తకాలు అందజేశారు నేతలు. దీనిపై స్పందించిన మాజీ పార్లమెంట్ సభ్యుడు కె.రాజగోపాల్ రెడ్డి జోక్యం చేసుకుని... రెబల్గా తన కుమార్తెను ఎన్నికల బరిలో పోటీ చేయించిన పాల్వాయికి ఆ పుస్తకాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దాంతో పాల్వాయి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ విషయం నీకు ఎందుకు అంటూ పాల్వాయి... రాజగోపాల్రెడ్డిపై ఫైరయ్యారు. దీంతో ఇద్దరు మధ్య చాలా సేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. పలువురు నాయకులు జోక్యం చేసుకుని సర్థి చెప్పినా వారు వినలేదు. సమావేశం అనంతరం కూడా ఇదే అంశంపై వారిరువురు తీవ్ర స్థాయిలో వాదులాడుకున్నారు.

ఇటీవల తెలంగాణకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె స్రవంతి నల్గొండ జిల్లా మునుగొడు అసెంబ్లీ టిక్కెట్ ఆశించారు. అయితే ఎన్నికల పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని వామపక్ష పార్టీకి కేటాయించారు. దీంతో స్రవంతి ఆ స్థానం నుంచి రెబల్గా బరిలోకి దిగి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కె.రాజగోపాల్ భువనగిరి నుంచి మరోసారి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి... ఓటమి పాలైయ్యారు. ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి మునుగొడు అసెంబ్లీ స్థానం వస్తుంది. తన ఓటమికి గల కారణాల్లో పాల్వాయి కుమార్తె కూడా ఓ కారణమని రాజగోపాల్ రెడ్డి భావించి పాల్వాయితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles