Mulayam singh yadav pulls up akhilesh government for slow pace of work in uttar pradesh

Mulayam Singh Yadav, samajwadi party, President, Uttar Pradesh, Akhilesh Yadav, cheif minister, pace of work, Development, slow progress

mulayam singh yadav pulls up akhilesh government for slow pace of work in Uttar Pradesh

కొడుకైనా సరే..పాలన సరిగ్గా సాగించకపోతే అంతే..

Posted: 11/23/2014 06:02 PM IST
Mulayam singh yadav pulls up akhilesh government for slow pace of work in uttar pradesh

సాధరణంగా ఎవరి కొడుకైనా పాలన సాగిస్తుంటే.. తండ్రి అది చూసి గర్వ పడతారు. కానీ ఆయన మాత్రం కొడుకైనా సరే.. పాలన సరిగ్గా సాగించకపోతే.. అక్షింతలు వేస్తారు. అది కూడా అందరి సమక్షంలో మీడియా ముఖంగానే. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా..? ఆయనే సమాజ్వాది పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్. తన తనయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు పాలనపై ఆయన మరోమారు చురకలు అంటించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు నత్త నడకన సాగడంపై తనయుడికి అక్షింతలు వేశారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి వదిలేస్తున్నారే తప్పా వాటిని పూర్తి చేయడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

'రాష్ట్రంలో ఎన్నో సంక్షమ పథకాలున్నాయని అభివర్ణించిన ఆయన అవి ప్రజలకు సక్రమంగా అందడం లేదని విమర్శించారు. ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడితే చాలదని, వాటిని ప్రజలకు సరిగ్గా అందేలా చేయాలని సూచించారు. ఇక రాష్ట్రంలో అభివృద్ది పనులు కూడా నెమ్మదిగా జరుగుతున్నాయి చురకలంటించారు. రాష్ట్రంలో అనేక శంకుస్థాపనలు ముఖ్యమంత్రి చేస్తున్నారని వింటున్నానని, అయితే తర్వాత వాటిని పూర్తిచేసినట్టు ఎక్కడా కనబడడం లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి తనను పిలుస్తారని ఎదురుచూస్తున్నాను' అని ములాయం అన్నారు.

తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ది ఇలా నత్త నడకన సాగలేదని అన్నారు. శంకుస్థాపన చేసినప్పుడే ప్రారంభోత్సవ తేదీని ప్రకటించానని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి క్యాబినెట్లో వున్న పనిచేయని మంత్రులకు కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. పనిచేయని వారిని, అభివృద్ది పనులపై పర్యవేక్షణ లేని వారిని ఇంటికి పంపిస్తామని పరోక్షంగా హెచ్చరించారు. 302 కిలోమీటర్ల లక్నో-ఆగ్రా ఎక్స్పెస్ కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ములాయం తనయుడు అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles