Wife gave all information to the police about her thief husband who stolen the bhupalapally grameen bank

warangal grameen bank, grameen bank theft story, grameen bank theft news, grameen bank theft attender ramesh, attendar rameh arrested, dig malla reddy, attendar ramesh wife, bhupala pally grameen vikas bank

wife gave all information to the police about her thief husband who stolen the bhupalapally grameen bank

‘‘దొంగ’’.. మొగుడ్ని పట్టించిన భార్యామణి!

Posted: 11/22/2014 08:10 PM IST
Wife gave all information to the police about her thief husband who stolen the bhupalapally grameen bank

ఇటీవలే వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి ఏపీ గ్రామీణ వికాస బ్యాంకులో జరిగిన భారీచోరీ పెద్ద సంచలనమే సృష్టించింది. ప్రధానద్వారానికి వేసిన తాళాలు వేసినట్టే వుండగా.. లాకర్లో వున్న నగలు, నగదు మొత్తం మాయం కావడంతో ఈ చోరీ వెనుక బ్యాంకు సిబ్బంది హస్తం ఖచ్చితంగా వుంటుందనే అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తు నేపథ్యంలో ఆ చోరీకి పాల్పడిన విషయాలు పూర్తిగా బయటపడ్డాయి. దీంతో ఆ చోరీకి పాల్పడిన బ్యాంకు అటెండర్ రమేష్ ను సునాయాసంగా పట్టుకోగలిగారు. ఆ దొంగను డీఐజీ మల్లారెడ్డి మీడిమాముందు ప్రవేశపెట్టిన అనంతరం.. కేసును ఎలా చేధించారో వివరించారు.

బ్యాంకు ప్రధానద్వారానికి తాళాలు వేసినవి వేసినట్టే వుండగా.. లోపల నగదు, నగలు చోరీ అయిన నేపథ్యంలో ఇందులో బ్యాంకు సిబ్బంది హస్తం వుంటుందనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే బ్యాంకు సిబ్బందిని పలుమార్లు పలురకాలుగా ప్రశ్నించారు. బ్యాంకు సిబ్బందితోపాటు వారి కుటుంబసభ్యులను కూడా ప్రశ్నించారు. ఇలా ప్రశ్నోత్తరాల సందర్భంలోనే రమేష్ భార్యను కూడా ప్రశ్నించారు. అప్పుడు ఆమె ద్వారా పోలీసులకు చాలా విషయాలు బయటపడ్డాయి. ఆమె ఇచ్చిన సమాచారంతోనే ఈ కేసును సునాయాసంగా ఛేధించగలిగామని వారు పేర్కొన్నారు. 34 కేజీల బంగారం, 21 లక్షల నగదును దొంగలించి కరీంనగర్ జిల్లాలోని అంబటిపల్లిలో బంధువుల ఇంట్లో దాచాడని పోలీసులు గుర్తించారు.

పోలీసులకు దొరకకుండా వుండేందుకు అతగాడు చోరీ సొత్తులోని 19 లక్షల రూపాయల తీసుకుని తీర్థయాత్రలకు వెళ్లాడు. అయితే దర్యాప్తులో భాగంగా అతడి భార్యను ప్రశ్నించగా ఆమె చాలా విషయాలు వెల్లడించిందని, ఆమె ఇచ్చిన సమాచారంతోనే చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. ఇలా ఈ విధంగా రమేష్ భార్య తన ‘దొంగ’ మొగుడ్ని పోలీసులకు అప్పగించింది. అయితే.. అటెండర్ అయిన రమేష్ చేతికి విలువైన స్ట్రాంగ్ రూం తాళాలు ఎలా వెళ్లాయన్న విషయాన్ని ఆరా తీస్తున్నామన్నారు. అంటే.. రమేష్ వెనుక ఇంకొకరి హస్తం వుండొచ్చని వారి అనుమానం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles