8 year old ceo to give keynote address on cyber security

Reuben Paul, 8 year old ceo, prudent games, cyber security, keynote address

8 year old ceo to give keynote address on cyber security

పరిమళించిన పుష్పమే ఈ బుడతడు..

Posted: 11/13/2014 12:05 PM IST
8 year old ceo to give keynote address on cyber security

పువ్వు పుట్టగానే పరమళిస్తుందన్న నానుడిని అక్షారల నిజం చేశాడు ఈ బుడతడు. నిండా ఎనమిదేళ్లు నిండకపోయినా.. అతిరథ మహారాధుల సమావేశంలో సైబర్ భద్రతపై కీలక ప్రసంగాలు చేస్తున్నాడు. తన ప్రసంగంతో అందరని ఆకట్టుకోవడమే కాకుండా, తన వ్యాక్కులతో దిగ్గజాలను సైతం మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు. అదీనూ ఓ కంపెనీకి సీఈవో హోదాలో. ఈ బుడతడితో పాటు ఆ వేదకను పంచుకునే వాళ్లలో భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి, ఆర్మీ మాజీ ఛీప్ వీకే సింగ్ కూడా ఉన్నారు.

రూబెన్ పాల్ అనే ఈ బుడతడు భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడు. కొత్త తరానికి సైబర్ భద్రతా నైపుణ్యాలు ఎందుకు అవసరమో అతడు వివరించనున్నాడు. సెక్యూరిటీ సదస్సులో ఎనిమిదేళ్ల రూబెన్ పాల్ కీలక ప్రసంగం చేస్తాడని సదస్సు నిర్వాహకులు తెలిపారు. తాను ఏడాదిన్నర క్రితం నుంచే కంప్యూటర్ లాంగ్వేజిలు నేర్చుకోవడం మొదలుపెట్టానని, ఇప్పుడు తన సొంత ప్రాజెక్టులు తానే డిజైన్ చేసుకుంటున్నానని రూబెన్ తెలిపాడు.

రూబెన్ పాల్ తండ్రి మనో పాల్ అతనికి కంప్యూటర్ పాఠాలు చెప్పారు. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజి గురించి మొదట్లో వివరించారు. ఇప్పుడు యాపిల్ ఐఓఎస్ ప్లాట్ఫాం మీద స్విఫ్ట్ ప్రోగ్రామింగ్ నేర్పుతున్నారు. ఒడిషాలో పుట్టిన మనో పాల్.. 2000 సంవత్సరంలో అమెరికా వెళ్లిపోయారు. ఆగస్టు నెలలో రూబెన్ తన సొంత గేమింగ్ సంస్థ ప్రూడెంట్ గేమ్స్ను ప్రారంభించాడు. దానికి రూబెన్ సీఈవో కాగా, అతడి తండ్రి మనోపాల్ కూడా ఆ సంస్థలో భాగస్వామిని చేశాడు. రూబెన్ సైబర్ భద్రత మీద సదస్సులలో ప్రసంగాలు చేయడం ఇది నాలుగోసారి. పిల్లల్లో సైబర్ భద్రతా నైపుణ్యాల గురించి చెప్పడంతో పాటు.. వైట్పేజి హ్యాకింగ్ మీద కూడా డెమో ఇస్తాడట.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reuben Paul  8 year old ceo  prudent games  cyber security  keynote address  

Other Articles