Red wine is good for health

red wine processing, red wine preparing process, red wine benifits for health, wine for health, drinking problems, body exercise tips, easy body weight loss tips, latest news

red wine is good for health : canada alberta university research team says that redwine is good for health it will give energy. grapes have great protines and vitamines that will help in building body muscles

ఈ వైన్ తాగితే వ్యాయామం చేసినట్లేనట !!

Posted: 11/04/2014 02:53 PM IST
Red wine is good for health

కండలు పెంచేందుకు కొందరు కష్టపడితే క్యాలరీలు ఖర్చు చేసేందుకు మరికొందరు కుస్తీలు పడతారు. అయితే ఈ రెండు కష్టపడి చేసేవే అలా కాకుండా తాపీగా కూర్చుని... తాగితే శక్తి వస్తుందని మీకు తెలుసా...? కాని ఇది నిజం. కెనడాలోని ఆల్బెర్టా యునివర్సిటీ కి చెందిన బృందం ఈ అంశంపై అధ్యయనం చేసి మరి చెప్తోంది. ఇంతకూ వీరు అంటోంది ఏమిటంటే.., రోజూ ఒక గ్లాసు రెడ్ వైన్ తాగితే ఆరోగ్యంగా ఉంటారట. ఒక గంట పాటు బాగా ఎక్సర్ సైజులు చేస్తే వచ్చే శక్తి ఒక్క గ్లాసు రెడ్ వైన్ తో వస్తుందట.

ద్రాక్ష పండ్లలో ఉండే రెస్వెరాట్రోల్ అనే యాంటి ఆక్సిడెంట్ రెడ్ వైన్ లో ఉండే డైక్ అండ్ కో హృదయ, కండరాల పనులను వేగవంతం చేస్తుందట. అంటే గ్లాసు వైన్ తాగితే చకచకా పనులు చేసుకొవచ్చన్నమాట. చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా ఇది వినటానికి. కాని ఇందులో ఉన్న ఉత్ప్రేరకాల వంటి యాంటి ఆక్సిడెంట్ల వల్ల శరీరం కొత్త ఉత్సాహంతో పని చేస్తుందన్నమాట. అందుకే వీరు రెడ్ వైన్ తాగితే తప్పేమి లేదు అని ప్రోత్సహిస్తున్నారు.

అదండి, తెలిసింది కదా... రెడ్ వైన్ తో కలిగే లాభాలు. దీని గొప్పతనం గురించి స్వయంగా తెలుసుకోవాలంటే మీరూ ట్రై చేసి చూడండి. అయితే ఇది కేవలం రెడ్ వైన్ గురించే అని గుర్తుంచుకొండి. శక్తి రావాలన్న తాపత్రయంలో రెడ్ వైన్ కు బదులు మరో వైన్ తాగారో...,. శక్తి మాట దేవుడెరుగు కాని ఏం చేస్తున్నారో తెలియని మైకంలోకి వెళ్తారు జాగ్రత్త.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : red wine  body  exercise  latest news  

Other Articles