Chandrababu serious on peetala sujatha gold ornament gift

Peethala Sujatha, gold ornament, vaddanam, gift, chandrababu, minister, chief minister, Ap government, serious

chandrababu serious on peetala sujatha gold ornament gift

అవిడకేమో అది.. మరి అన్నకు, నీకు ఏంటీ..?

Posted: 11/04/2014 01:35 PM IST
Chandrababu serious on peetala sujatha gold ornament gift

దాదాపు ముప్పై ఏడున్నర లక్షల విలువైన ఓ వడ్డాణం...ఇప్పుడు ఆంధ్రప్రదేశ్  కేబినెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తుండగానే మరో ప్రశ్న తెరపైకి వచ్చింది. ఓ మహిళా మంత్రికి  గ్రానైట్‌ వ్యాపారులు బంగారు వడ్డాణం గిప్ట్గా ఇచ్చినట్టు వచ్చిన వార్త....సచివాలయంలో టాక్‌ ఆఫ్‌ టుడేగా మారిపోగా.. అదే సమయంలో అవిడకే వడ్డాణం ఇప్పిస్తే.. మరి సొంత అన్నయ్యకు ఎంత ఇప్పించావుంటూ ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.  ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మహిళా మంత్రిని పిలిచి వివరణ అడిగినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాతకు ఇటీవలే ప్రకాశం జిల్లా గ్రానైట్ వ్యాపారులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు ఆమెకు సుమారు రూ.37 లక్షల విలువైన బంగారు వడ్డాణం కానుకగా ఇచ్చినట్లు విస్తృతంగా చర్చ జరుగుతోంది. అదే జిల్లాకు చెందిన మరో మంత్రి సోదరుడు...దగ్గరుండి ఈ తతంగాన్ని నడిపించారట. ఈ ఆరోపణలను పీతల సుజాత తీవ్రంగా ఖండించారు. తాను ఎవరి దెగ్గరా బహుమతులు తీసుకోలేని స్పష్టం చేశారు. తనకు గ్రానైట్ వ్యాపారులు సన్మానం చేసిన మాట వాస్తవమేనని అయితే వారు తనకు ఎలాంటి గిప్ట్లు ఇవ్వలేదన్నారు.ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు తనను పిలిచి వివరణ అడిగినట్లు వస్తున్న వార్తలు కూడా సత్యదూరమన్నారు. తనపై కావాలనే ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు.

అయితే మంత్రి పీతల సుజాతపై ఆరోఫణలు వచ్చిన నేపథ్యంలో.. అంతకు మించిన స్థాయిలో ఇప్పుడు మరో మంత్రిపై కూడా ఆరోఫణలు వెల్లువెత్తుతున్నాయి. సహచర మంత్రికే 37 లక్షల రూపాయల విలువైన బహుమతి ఇప్పించిన నేపథ్యంలో..సోంత అన్నయ్యకు ఎంత ఇప్పించి ఉంటారన్న ఆరోఫణలు తెరపైకి వస్తున్నాయి. అంతేకాదు..ఇద్దరు మంత్రులతో వ్యవహారం నడిపేందుకు ఆయన ఎంత తీసుకుని వుంటారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ప్రజలకు అవినీతి రహిత పాలనను అందిస్తామని చెప్పిన చంద్రబాబు.. అవినీతి మంత్రులను తన క్యాబినెట్ నుంచి తప్పించాలని కూడా డిమాండ్లు పెరుగుతున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Peethala Sujatha  gold ornament  vaddanam  gift  chandrababu  minister  chief minister  Ap government  serious  

Other Articles