Forceful sex on menopausal woman not rape says delhi high court

Forceful sex, menopausal woman, rape, Delhi High Court, 376 IPC, intercourse, menopause, judgement, legal experts, Women Associations

Forceful sex on menopausal woman not rape, says Delhi High Court

వృద్ద మహిళలపై అత్యాచారం.. రేప్ కిందకు రాదు..

Posted: 11/04/2014 11:27 AM IST
Forceful sex on menopausal woman not rape says delhi high court

వృద్దనారీ ప్రతివ్రతహా: అంటూ పురుషాధిక్య సమాజం ఎంతగా ఎగతాళి చేసినా.. సహనంతో భరించే అమ్మలకు ఆపద వచ్చిపడింది. కాసింత పెద్ద వయస్సు మహిళలు కనబడగానే అమ్మా అంటూ సంబోధించి ఈ సమాజంలో వారికి కూడా రక్షణ కరువవుతోంది. కామంతో మదమెక్కిన మగమృగాళ్లు.. మూడు, నాలుగు, ఐదు, ఆరేళ్ల బాలికపై కూడా అత్యాచారాలకు తెగబడుతుంటే.. రుతువిరతికి చేరుకున్న వృద్ద మహిళలకు కష్టాకాలం వచ్చిపడింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య బెంచ్ ఇచ్చిన తీర్పుపై న్యాయ మేధావులు ఆలోచనలో పడ్డారు.

జస్టిస్ ప్రదీప్ నన్ డ్రా జోగ్, జస్టిస్ ముక్తా గుప్తాలతో కూడిన ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు తమ తీర్పను వెళ్లడించింది. అంతేకాదు ఈ తరహా కేసులో నిందితుడైన అచయ్ లాల్ ను కింది కోర్టులు విధించిన పదేళ్ల జైలు శిక్షను రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పను వెలువరించింది. రుతివిరతికి చేరుకున్న మహిళలపై అత్యాచారం జరిపినా.. దానిని రేప్ కింద పరిగణించలేమని చెప్పింది. సాధారణంగా మహిళలపై అత్యచారాలకు పాల్పడిన కేసులో నిందితులకు భారత శిక్షాస్మృతి 376 కింద కేసు నమోదు చేస్తారు. అయితే ఈ కేసులో నిందితుడు 65 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సున్న వృద్దురాలిపై బలవంతం చేశాడని, అమె రుతువిరతికి చేరకుందని.. ఇలాంటి వారిపై అత్యాచారం చేసినా.. దానిని రేప్ కింద పరిగణించలేమని తెలిపింది. దీంతో బాధితురాలిని అత్యాచార బాధితురాలిగా పరిగణించలేమని న్యాయస్థానం తెలిపింది.

న్యాయస్థానం తీర్పుపై న్యాయవాది, వింద్రా గ్రోవర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దేనిని పరిగణలోకి తీసుకుని న్యాయస్థానం తీర్పును వెలువరించిందని ఆయన ప్రశ్నించారు. రుతివిరతి అనే వైద్యరంగ పదాన్ని న్యాయస్థానం ఎలా పరిగణలోకి తీసుకుంటుందని ఆయన నిలదీశారు. మహిళలను మహిళలుగానే చూడాలని, వారి వయస్సును, రుతువిరతిని బట్టి తీర్పును చెప్పకూడదని ఆయన అభ్యంతరం తెలిపారు. మరోవైపు ఢిల్లీ హైకోర్టు తీర్పుపై మహిళా సంఘాలు కూడా మండిపడుతున్నాయి. మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని, 80 ఏళ్ల వృద్ద మహిళలు కూడా అత్యాచారం బారిన పడుతున్నారని అఖిలభారత ప్రజాస్వామ్య మహిళా సంఘం అధ్యక్షురాలు జుగ్మతి సాంగ్వన్ అన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles